తెలంగాణ

బ్రాహ్మణ సంక్షేమ చర్యలు అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం, అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని తిరుపతి బ్రాహ్మణ సమాజం పేర్కొంది. ఈ మేరకు తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్ష, కార్యదర్శులు కెవి రంగానాథన్, కొత్తపల్లి అజయ్‌కుమార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించడంతో పాటు ట్రస్టు ఏర్పాటు, సదనం నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప కార్యాలని తమ లేఖలో పేర్కొన్నారు. ఈ చర్యలు బ్రాహ్మణుల విద్య, ఆర్థిక వృద్ధికి ఎంతో దోహదపడుతాయని వారు పేర్కొన్నారు. యావత్ బ్రాహ్మణ సమాజం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తిరుపతి సందర్శన సందర్భంగా తమ బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేయబోయే సమావేశానికి తప్పక రావాలని ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు.