తెలంగాణ

అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఐసియు యూనిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను నెలకొల్పామని, ఇక్కడ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన రోగులకు సత్వరమే వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ పదవ ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ కాంగ్రెస్ సభలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్‌పై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత న్యూరాలజిస్టు, ప్రపంచ కాంగ్రెస్ కో చైర్మన్ డాక్టర్ జయరాజ్ పాండియన్ మాట్లాడుతూ మెదడులో బ్లాకేజీ వల్ల 85 శాతం కేసుల్లో బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తున్నట్లు చెప్పారు.
బిపి, రక్తస్రావం, ఎక్కువ కొలెస్టరాల్, టైప్ 2 డయాబెటిస్, క్రమ పద్ధతి లేకుండా గుండె కొట్టుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందన్నారు. దేశంలో 1.7 మిలియన్ల మంది ప్రతి ఏడాది ఈ వ్యాధి బారినపడుతున్నారన్నారు. సరైన ఆహార అలవాట్లు లేకపోవడం, స్ట్రోక్ వచ్చిన తర్వాత తగిన వైద్య చికిత్స లేనందు వల్ల దీని తీవ్రత పెరుగుతోందన్నారు. కాగా భారత క్రికెట్ ప్రముఖుడు సునీల్ మనోహర్ గవాస్కర్ భారత్ స్ట్రోక్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన వీడియో ద్వారా మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి గ్రస్తులకు సకాలంలో వైద్య సహాయం అందించేందుకు, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను కృషి చేస్తానన్నారు.