తెలంగాణ

వంట గదే డ్రగ్స్ ఫ్యాక్టరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ నేరేడ్‌మెట్, అక్టోబర్ 28: హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం బయటపడింది. సైనిక్‌పురిలో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు శుక్రవారం భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రూ. 9 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నెల రోజులు గడవకముందే ఇదే ప్రాంతంలో ఇంత భారీగా డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. ఈనెల 4న డ్రగ్స్ తయారీ కేసులో అరెస్టయిన వెంకటరామారావును విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన సమాచారంతో బెంగుళూరుకు చెందిన ఎన్‌సిబి అధికారులు సైనిక్‌పురిలోని ఇంటిపై దాడులు నిర్వహించారు. కాగా డ్రగ్స్ తయారీ ముఠా రాజశేఖర్ పేరుతో ఇంటిని అద్దెకు తీసుకొని యాంఫెంటామైన్‌ను తయారు చేస్తున్నట్టు ఎన్‌సిబి అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ దందాలో ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్‌రెడ్డి (బెంగుళూరు), వెంకటరామారావు (జీడిమెట్ల), అతని భార్యతోపాటు ముంబయికి చెందిన మరో నిందితుడు నవీద్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణలో ఉండగా బెయిల్‌పై వచ్చిన ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్‌రెడ్డి సైంటిస్టుగా అవతారమెత్తాడు. సైనిక్‌పురిలోని అద్దె ఇంట్లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఎన్‌సిబి అధికారులు పేర్కొన్నారు. 9కిలోల ఫెంటామైన్ విలువ మార్కెట్‌లో 9కోట్లు ఉంటుందని, అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని ఎన్‌సిబి అధికారులు తెలిపారు. ఇదిలావుండగా ఇంతకుముందు వెంకటరామారావు అనే శాస్తవ్రేత్తను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 230 కిలోల యాంఫెంటామైన్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వెంకటరామారావు బెంగుళూరులో శాస్తవ్రేత్తగా పనిచేస్తూ డ్రగ్స్ వ్యాపారం చేసేవారని, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కూడా అదే పద్ధతిలో శాస్తవ్రేత్తగా డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్ నుంచి విదేశాలకు సరఫరా చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
మల్లాపూర్‌లో..
రంగారెడ్డి జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక వాడలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ. 11.50 కోట్ల అల్ఫాజైడోమ్ మాదకద్రవ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాల్‌రెడ్డి అనే నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.