తెలంగాణ

ఉగాదికి సినిమా పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సినిమా రంగం సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రివర్గ ఉప సంఘం వెల్లడించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కె తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కూడిన ఉప సంఘం తొలి సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. 2011 నుంచి ఇప్పటి వరకు నంది అవార్డులను ప్రదానం చేయలేదు. ఈ ఉగాదికి ఒకే సారి అవార్డులను బహూకరించనున్నట్టు చెప్పారు.చిత్రపురిలో సినిమా కార్మికులకు ఇళ్లు కట్టించి ఇవ్వనున్నట్టు తెలిపారు. థియోటర్లలో ఇకపై రోజుకు ఐదు సినిమాలు ప్రదర్శించేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో త్వరలోనే టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చలన చిత్ర అభివృద్దికి సమగ్ర నివేదిక రూపొందించి, దేశ వ్యాప్తంగా తెలుగు చిత్ర రంగానికి మంచి గుర్తింపు తీసుకు రావాలని తలసాని అధికారులను ఆదేశించారు. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశానికి సినీ రంగ ప్రముఖులు దాసరి నారాయణరావు, డి సురేష్ బాబు, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు రామ్మోహన్‌రావు, తమ్మారెడ్డి భరద్వాజ, శ్యాంప్రసాద్‌రెడ్డి, కెయస్ రామారావు, మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ఆర్ నారాయణమూర్తి, వివిధ సినీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. చిత్ర నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని కోరారు. 41 చిన్న సినిమాలు, ఏడు బాలల సినిమాలకు రావలసిన రాయితీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. చిత్రపురి పక్కనే పున్న 9.5 ఎకరాల ప్రభుత్వ స్థలం కార్మికుల గృహ వసతికి కేటాయించాలని కోరారు. మునిసిపాలిటీ ప్రాంతాల్లో 200 సిటింగ్ సామర్ధ్యంతో మినీ థియోటర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చిత్ర రంగానికి పేరు తీసుకు వచ్చే విధంగా నూతన ఆలోచనలతో సినీ పెద్దలు నివేదిక రూపొందించి తదుపరి సమావేశానికి హాజరు కావాలని సబ్ కమిటీ మంత్రులు కోరారు. సినిమా రంగంలోని సంఘాలు ఏకత్రాటిపైకి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు తుమ్మల, తలసాని,కెటిఆర్