తెలంగాణ

విద్యతోనే మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: భావితరాలకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తేవొచ్చని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్య సాధన కోసమే ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా విరివిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన గురుకుల పాఠశాలలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో గురుకుల విద్య విస్తరణపై క్యాంపు కార్యాలయంలో శనివారం సిఎం సమీక్ష జరిపారు. పేదల సంక్షేమానికి ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రేషన్ బియ్యం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నా, భావి తరాలకు మంచి విద్య అందించడం ద్వారానే పేదల జీవితాలు బాగుపడతాయని తాను బలంగా నమ్ముతున్నట్టు సిఎం చెప్పారు. అందుకే ఒక్కో విద్యార్థిపై దాదాపు 84 వేల రూపాయలు ఖర్చుపెడుతూ నాణ్యమైన విద్య, వసతి, ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీలకు నియోజక వర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. మైనారిటీ వర్గాలకు దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ఏడాది 71 మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 89 విద్యాలయాలు ప్రారంభిస్తామని, దీంతో గురుకులాల సంఖ్య 160కి చేరుతుందన్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో మైనారిటీల జనాభా, స్థలాల అందుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇంకా అదనంగా గురుకులాలు మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సిఎం ప్రకటించారు.2016-17 విద్యా సంవత్సరంలో 71 మైనారిటీ గురుకుల విద్యాలయాల ద్వారా 17వేల మందికి విద్య అందుతున్నదని, దీనికోసం 143.21 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. 160 గురుకులాల ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్షమంది విద్యార్థులు గురుకుల విద్యాలయాల ద్వారా మంచి విద్య పొందుతారన్నారు. దీనికోసం 2,568 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. దీనికి అదనంగా గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు, ఇతర వౌలిక సదుపాయాల కోసం మరో మూడు వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. లక్ష కుటుంబాలకు మంచి భవిష్యత్ అందుతుందన్నారు. ఇది సామాజిక మార్పు దిశగా వేస్తున్న గొప్ప ముందడుగు అని చెప్పారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని మైనారిటీ గురుకులాలు ఏర్పాటు కావాలని ఆయా ప్రాంతాల్లో మైనారిటీ జనాభా ఆధారంగా వీటిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.