తెలంగాణ

ముగ్గురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్‌కు స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను అప్పగించారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీమతి బి. విజేంద్రకు తెలంగాణ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను అప్పగించారు. మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ జి. లక్ష్మీబాయికి మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, రైతు బజార్ల సిఇఓ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అటవీ శాఖలో తొమ్మిది మంది సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాజీవ్ శర్మ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. అడిషనల్ పిసిసిఎఫ్ (ఎస్‌ఎఫ్) డాక్టర్ మనోరంజన్ బాంజాను అడిషనల్ పిసిసిఎఫ్ (వైల్డ్‌లైఫ్) గా నియమించారు. ఈ పోస్టులో ఉన్న ఎం. పృథ్వీరాజును అడిషనల్ పిసిసిఎఫ్ (ప్రొడక్షన్) గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డాక్టర్ చంద్ర బి మలాసిని అడిషనల్ పిసిసిఎఫ్ (ల్యాండ్ రికార్డ్స్) గా నియమించారు. అడిషనల్ పిసిసిఎఫ్ (కంపా అండ్ ఎఫ్‌సిఎ) ఆర్. శోభను అడిషనల్ పిసిసిఎఫ్ (ఎఫ్‌సిఎ)గా నియమించారు. అడిషనల్ పిసిసిఎఫ్ (డెవ్) గా పనిచేస్తున్న మునీంద్రను అడిషనల్ పిసిసిఎఫ్ (అడ్మిన్ అండ్ ఐటి) గా నియమించారు. అడిషనల్ పిసిసిఎఫ్ (ప్రొటెక్షన్ అండ్ విజిలెన్స్) రాకేష్ మోహన్ దోబ్రియాల్‌ను అడిషనల్ పిసిసిఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న లోకేశ్ జైస్వాల్‌ను అడిషనల్ పిసిసిఎఫ్ (కంపా) గా నియమించారు. అడిషనల్ పిసిసిఎఫ్ (ఐటి) సునీల్ కుమార్ గుప్తాను అడిషనల్ పిసిసిఎఫ్ (డెవ్ అండ్ డబ్ల్యుపి)గా నియమించారు. హెచ్‌ఎండిఎలో అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్. శ్రీనివాస్‌ను అటవీశాఖ అడిషనల్ పిసిసిఎఫ్ (ప్రొటెక్షన్ అండ్ విజిలెన్స్) గా నియమించారు. కొత్త పోస్టుల్లో నియమించిన అధికారులంతా వెంటనే కొత్త బాధ్యతలను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.