తెలంగాణ

పాలెం దుర్ఘటనకు మూడేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, అక్టోబర్ 29: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామ సమీపంలో ఓల్వో బస్సు ప్రమాదం జరిగి నేటితో మూడేళ్లు ముగిసింది.
బెంగళూరు నుండి హైదరాబాద్‌కు జబ్బార్ ట్రావెల్ బస్సు పాలెం సమీపంలో రాగానే డివైడర్‌ను ఢీకొని మంటలు వ్యాపించి అందులో ప్రయాణిస్తున్న 45 మంది సజీవ దహనమై దేశంలో సంచనలం రేకెత్తించింది. దీపావళికి వెళుతూ ఈ ప్రమాదంలో వారంతా మృత్యువాత పడ్డారు. సగం మంది బాధితులకు ఇప్పటికీ పరిహరం అందలేదని అధికారులు చెబుతున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నివేదిక అందించాలని అప్పటి కమిషనర్లు అయిన రేమాండ్ పీటర్, ప్రేమచంద్రారెడ్డిని నియమించింది.
దీంతో ప్రమాదం జరిగిన వివరాలను ట్రాన్స్‌పోర్టు అధికారులతో పాటు జరిగిన సంఘటన బాధితులను వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రోడ్డు లోపం వల్లే ఓల్వో బస్సు ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కాగా, జబ్బార్ ట్రావెల్ బస్సు యాజమానిపై, డ్రైవర్లపై కేసులు నమోదు చేసిన ఇప్పటివరకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, పాలెం సమీపంలోని జాతీయ రహదారిపై వారి మృతికి చిహ్నంగా స్మారక స్థూపాన్ని నిర్మించాలని 2014లో ఫౌండేషన్ వేశారు. కానీ ఇప్పటి వరకు స్థూపాన్ని నిర్మించలేకపోయారు. ఈ కార్యానికి నాయకత్వం వహించిన సిపిఎం నాయకుడు సుధాకర్‌తో పాటు బాధితులు ఆయనకు బాసటకు నిలిచారు. బాధితులకు న్యాయం చేయాలని పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. పాలెం బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్‌రెడ్డికి కూడా అసెంబ్లీలో ఈ అంశాన్ని లెవనెత్తారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.

దగ్ధమవుతున్న ఓల్వో బస్సు (ఫైల్‌ఫొటో)

పాలెం సమీపంలో నిర్మించిన స్మారక స్థూప శిలాఫలకం.
దగ్ధమైన జబ్బార్ ట్రావెల్ బస్సు