తెలంగాణ

మన కృషికి తగిన ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 31: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఫస్ట్ ర్యాంకు సాధించటం పట్ల సిఎం కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలను సులభతరం, సరళతరం చేసిన ఫలితాలే ఇప్పుడు అందరికీ అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారికి, వర్తక, వ్యాపార, వాణిజ్యం నిర్వహించాలనుకునేవారి కోసం ప్రభుత్వం రూపొందించిన కొత్త విధానాలు అనుకూల వాతావరణం కల్పించాయన్నారు. 340 విభాగాల్లో విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ర్యాంకింగ్ నిర్వహించారని, ఆయా విభాగాలను పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగాన్ని సిఎం అభినందించారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పారదర్శకత, సింగిల్ విండో విధానం, భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రధాన విభాగాల్లో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలకు గరిష్ట మార్కులు రావడం పట్ల సిఎం ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉండటం వల్లే తక్కువ సమయంలోనే తెలంగాణలో 2.5వేల పరిశ్రమలు కొత్తగా వచ్చిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. గత ఏడాది 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది మొదటి స్థానంలో నిలవడానికి ప్రభుత్వ విధానాలతోపాటు అధికారుల కృషి కారణమన్నారు. ఇదే స్ఫూర్తి, ఒరవడి కొనసాగించి మరింత నాణ్యమైన, సులభతరమైన సేవలు అందించాలని అధికారులకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.