తెలంగాణ

డిసెంబర్‌లో మిషన్ కాకతీయ-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: మూడవ దశ మిషన్ కాకతీయ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. మిషన్ కాకతీయ-1, మిషన్ కాకతీయ-2లో చేపట్టిన పనులు, ఫలితాలలను మంత్రి సమీక్షించారు. మిషన్ కాకతీయ కింద ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు అదనంగా నీరు అందడం రికార్డు అని మంత్రి అన్నారు. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ ఫలితాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. భూగర్భ జల సంపద పెరిగిన తీరుతో పాటు పెరిగిన సాగు విస్తీర్ణం,చేపలు పట్టుకొని జీవించే వారి జీవితాల్లో వచ్చిన మార్పు, వారి ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల తదితర అంశాలపై అధ్యయనం చేసి అంశాల వారిగా నివేదికలు తయారు చేయాలని మంత్రి కోరారు. మిషన్ కాకతీయ మూడవ దశ కింద చేపట్టవలసిన పనులకు సంబంధించిన మార్గదర్శకాలను మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. వర్షాలు కురవకపోవడంతో కరువు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు మిషన్ కాకతీయ మూడవ దశలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి తదితర జిల్లాలలో ఇలాంటి ప్రాంతాలను గుర్తించి చెరువుల పునరుద్ధరణ జరపాలని కోరారు. మిషన్ కాకతీయ రెండవ దశ పూర్తి కాకుండా మిగిలి పోయిన పనులన్నిటినీ మూడవ దశలో చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న, కట్ట తెగిన చెరువుల మరమ్మత్తు పనులు చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. గొలుసు కట్టు చెరువులకు చెందిన ఫీడర్ చానళ్లు, డైవర్షన్ చానళ్ల పనులు మిషన్ కాకతీయ కింద చేపట్టాలని సూచించారు. ఆయకట్టు లోకలైజేషన్ చేయాలని, రెవెన్యూ అధికార యంత్రాంగం సహకారంతో చెరువుల ఎఫ్.టి.ఎల్ నిర్థారించాలని కోరారు. ఆయకట్టు మ్యాపులను సిద్ధం చేయాలని చెప్పారు. కొత్త చెరువులను నిర్మించడం కోసం హెడ్రాలిక్ క్లియరెన్స్, సర్వే పనులు ఇతర కార్యక్రమాల అంచనాలు, ప్రతిపాదనలు డిసెంబర్ 9వ తేదీ లోగా సమర్పించాలని హరీశ్‌రావు అధికారులకు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మినీ ట్యాంక్‌బండ్ పనులు మిషన్ కాకతీయ 3 కింద పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో సిఇలు హరిరామ్, నాగేందర్‌రావు, సురేష్, ఓఎస్‌డి శ్రీ్ధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.