తెలంగాణ

‘అభినవ శిశుపాలుడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిస్థితి శిశుపాలుని మాదిరిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వంద అబద్దాలు ఆడారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయకపోవడంతో సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 3200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో రెండున్నర లక్షల మంది అధ్యాపకులకు వేతనాలు రావడం లేదని అన్నారు. విద్యార్థులతో పెట్టుకోవడం మంచిది కాదని ఆయన హితవు చెప్పారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు తాను నవంబర్ 7న సంగారెడ్డిలో సుమారు 5 వేల మంది విద్యార్థులతో మహా ధర్నా నిర్వహించనున్నానని ఆయన తెలిపారు. ఈ ధర్నాలో టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర నాయకులు హాజరవుతారని ఆయన చెప్పారు.