తెలంగాణ

మేడారానికి బయల్దేరిన సమ్మక్క ఆడపడుచు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల: సమ్మక్క ఆడపడుచు లక్ష్మీదేవర (లక్ష్మిదేవమ్మ), పోతరాజు, క్రిష్ణస్వామి అంగరంగ వైభవంగా వరంగల్ జిల్లా నగరంపల్లి నుండి గురువారం మేడారానికి బయలుదేరారు. వన దేవతలు మేడారం గద్దెలకు వచ్చే ముందు లక్ష్మీదేవరమ్మను ప్రతిష్ఠిస్తామని పూజారులు తెలిపారు. దీంతో నగరంపల్లి నుండి లక్ష్మిదేవర, కృష్ణస్వామి, పోతురాజుల విగ్రహాలతో మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు కాలినడకన పూజారులు సదయ్య, సారయ్య, పెద్ది మల్లేష్, రాజేందర్, మేకల లట్టయ్య, కైలాసం, చంద్రుడు, నర్సయ్యలు బయులు దేరారు. లక్ష్మీదేవరమ్మ సమ్మక్క అడపడుచు, పగిడిద్దరాజుకు చెల్లెలని, క్రిష్ణస్వామికి భార్య అని పూజారులు తెలిపారు. అలాగే, పోతరాజు ఆమెకు మరిది అని వారు చెప్పారు. కాకతీయులతో జరిగిన యుద్ధంలో సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు లక్ష్మీదేవమ్మ, ఆమె భర్త క్రిష్ణస్వామి, పోతరాజు పోరాడి అమరులైయ్యారన్నారు. ఆ వంశానికి చెందిన కొందరు గణపురం మండలం నగరంపల్లికి వచ్చి లక్ష్మీదేవమ్మకు, క్రిష్ణస్వామి, పోతరాజులకు చిన్న కుటీరాన్ని వేసి గుడిగా చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్వ కాలం నుండి తమ వంశీయులు లక్ష్మీదేవరను సమ్మక్క=సారలమ్మ జాతరను పురస్కరించుకొని కాలి నడకన మేడారానికి వెళ్లడం జరుగుతుందన్నారు. మేడారంలో జరిగే జాతరలో అమ్మవార్ల గద్దెలపై తొలిసారిగా విగ్రహాలను ప్రతిష్ఠించడం అనవాయితీ. బూర్గపేట, కాల్వపల్లి, దూదేకులపల్లి మీదుగా మేడారానికి తీసుకువెళ్తారని అన్నారు. మేడారంలో వన దేవతలు వన ప్రవేశం చేసిన అనంతరం తిరిగి నగరంపల్లికి తీసుకొచ్చి దేవాలయంలో ఉంచుతామని పూజారులు తెలిపారు. ఈ దేవతలను తీసుకొచ్చే పూజారులు వారం రోజుల ముందు నుండే ఉప వాస దీక్షలు చేస్తుంటారని చెప్పారు. అయితే, ఈ దేవరలు జంపన్న వాగులో జలకాలాటలతో ఊగిపోవడం శరణు చెప్పడం వలన భక్తులు ఈ దేవతలను స్మరించుకొని మొక్కులు చెల్లించుకొంటారు. లక్ష్మీదేవర దేవతలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకపోడు కులస్థులు కోరుతున్నారు.

స్వామి సత్యవ్రతానంద
అస్తమయం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 11: గత 18 సంవత్సరాలుగా సద్గురు శివానందస్వామి మార్గంలో పయనిస్తూ సికింద్రాబాద్‌లోని శివానందాశ్రమం ద్వారా అపూర్వ సేవలందించిన స్వామి సత్యవ్రతానంద గురువారం ఇక్కడ అస్తమించారు. శివానంద భారతి మాసపత్రికను స్థాపించి నడిపిన ఆయన శ్రీ వేంకటేశ్వరాలయం, శ్రీ లలితాంబికాలయాలను నిర్మించారు. యోగా ద్వారా, భజనల ద్వారా ప్రజానీకంలో చైతన్యం కలిగించారు. ఋషికేశ్‌లోని దివ్యజీవన సంఘానికి అనుబంధంగా ఆశ్రమాన్ని నడిపించి భక్తులకు ధర్మప్రబోధం కావించారు. స్వామి నిథనానికి భక్తులెందరో విలపిస్తూ అశ్రునివాళిని ఘటించారు. జోహారులర్పించారు. సత్యవ్రతానంద అంత్యేష్టి 12వ తేది శుక్రవారం ఉదయం పద్మారావు నగర్‌లోని శివానందాశ్రమం నుంచి ప్రారంభం అవుతుందని శివానంద భారతి మాసపత్రిక సంపాదకుడు కసిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

ఎక్సైజ్ సిబ్బందికి
రివార్డులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ వ్యాప్తంగా విశిష్ట సేవలందించిన 43 మంది ఎక్సైజ్ సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. రివార్డులు అందుకున్న వారిలో 13 మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, 12 మంది ఎస్‌ఐలు, 14 మంది ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. మహబూబాబాద్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పిఆర్ చంద్రశేఖర్‌రావు, ఆందోల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాస్‌కు 2016 జనవరి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు దక్కింది. చంద్రశేఖర్‌రావు మహబూబాబాద్ పరిధిలో 4,984 కిలోల గంజాయి, 250 కిలోల మత్తు పదార్థాలు, అక్రమ మద్యం పట్టుకున్నారు. వీటిని అక్రమంగా రవాణా చేస్తున్న ఒక లారీ, ఒక టాటా ఏస్‌ను కూడా సీజ్ చేశారు. అదేవిధంగా మూడు పిడి యాక్టులు ప్రయోగించడంతో ఆయనకు రివార్డు లభించింది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కల్తీ కల్లుకు ఉపయోగించే 75 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను పటుకున్నందుకు ఆయనకు రివార్డు లభించింది.