తెలంగాణ

నేడో, రేపో బిజెపి రాష్ట్ర కార్యవర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె.లక్ష్మణ్‌కు పార్టీ రాష్ట్ర కమిటీని నియమించుకోవడం తలకు మించిన భారమైంది. ఈవారంలో కొత్త కమిటీ ప్రకటించేందుకు అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త కమిటీలో ప్రస్తుతం ఉన్న వారిలో ఎంత మందికి తిరిగి చోటు దక్కుతుందో, ఎంత మందికి పదవులు ఊడతాయోనన్న ఊహగానాలు, చర్చ పార్టీలో జరుగుతున్నది. కొత్తగా నియమించే కమిటీ వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఉంటుంది కాబట్టి ఆశావాహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కూడా పార్టీ కార్యవర్గం ‘కూర్పు’ అంత తేలికేమీ కాదు. విమర్శలు తలెత్తకుండా, బిసిలకు పెద్ద పీట వేయాలని ఆయన కసరత్తు చేస్తున్నారు.
కేంద్ర కమిటీ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 27 మందికి మించి కమిటీ ఉండరాదు, 20 శాతానికి మించి కమిటీలో మార్పులు చేయరాదు. కులాల వారీగా సమతుల్యం పాటించడం అనేది గగనమైంది. గతంలో జి. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నియమించిన కమిటీలో ఇద్దరు రెడ్లు ఎక్కువ కావడంతో మొత్తం కమిటీపైనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుత కమిటీలో ఏడుగురు రెడ్లు, ముగ్గురు బ్రాహ్మణులు, ఐదుగురు వెలమలు, 8 మంది బిసిలు, ఎస్‌సి, ఎస్‌టిలు ఇద్దరేసి ఉన్నారు.
ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ తన మార్కు కమిటీని నియమించబోతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. ఈ నెల మొదటి వారంలో కమిటీని ప్రకటించేందుకు ఆయన కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర కమిటీలో కొత్తగా బి. వెంకట్‌రెడ్డి, ప్రేంరాజ్ యాదవ్, శ్రీ్ధర్ రెడ్డికి, సంకినేని వెంకటేశ్వర రావు, రామకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, సత్యనారాయణ (సంగారెడ్డి) తదితరులకు పార్టీ రాష్ట్ర కమిటీలో చాన్స్ దక్కే అవకాశం ఉంది. పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మజారెడ్డిని రాష్ట్ర కమిటీలోకి తీసుకుని, ఆమె స్థానంలో ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో ఉన్న విజయలక్ష్మిని నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యువ మోర్చా అధ్యక్షుడ్ని కూడా రాష్ట్ర కమిటీలోకి తీసుకునే అవకాశం ఉంది. నగర పార్టీ అధ్యక్షునిగా ఉన్న వెంకట్‌రెడ్డి స్థానంలో శ్యాంసుందర్ లేదా వెంకటరమణికి అవకాశం లభించే అవకాశం ఉంది. జిల్లాల సంఖ్య 31కి పెరిగినందున, చాలా మంది ఆశావాహులను వారి జిల్లాల అధ్యక్షులుగా నియమించే అవకాశం ఉంది. రమాదేవి (నిర్మల్), ఆర్. పద్మ (వరంగల్) తదితరులు జిల్లా అధ్యక్షులుగా నియమించే అవకాశం ఉంది.