తెలంగాణ

వెంకటేశ్వర శరణాగతితో సర్వజగద్రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ దేవునిపై నమ్మకం ఉంచాలనీ, వెంకటేశ్వర స్వామి శరణాగతి సర్వజగద్రక్ష అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు సంయుక్త్ధ్వార్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న వేంకటేశ్వర వైభవోత్సవముల కార్యక్రమంలో భాగంగా 6వరోజు గురువారం ‘శ్రీనివాస కళ్యాణం’ అంగరంగంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా గవర్నర్ నరసింహన్ దంపతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాల రావు, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి, కెసిఆర్ భార్య శోభ, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు.
భక్త జనాన్ని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ నగరానికి వేంకటేశ్వర స్వామిని రప్పించి దర్శన భాగ్యం కల్పించటం సంతోషకరమన్నారు. ప్రతి వ్యక్తి ధర్మంపై నమ్మకం ఉంచాలని, వేంకటేశ్వర స్వామిని నమ్మిన వారిని శ్రీవారు వదలరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలనీ, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందని అన్నారు. వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహణ ద్వారా టిటిడి సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని అన్నారు. ప్రపంచంలో మానసిక వికాసానికి భక్తి భావం ముఖ్యమన్నారు. భక్తి భావం వ్యక్తిని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. ప్రతి రెండు నెలలకోసారి దేశంలోని ముఖ్యనగరాలలో వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించటానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తిరుమలలో మాదిరి వైభవంగా భక్తి భావంతో కార్యక్రమం నిర్వహించటం సంతోషకరమని టిటిడి యాజమాన్యాన్ని, అధికారులను అభినందించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలోకెల్లా భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం చాలా గొప్పదని అన్నారు. ఆధ్యాత్మిక భావన, భక్తి భావన అన్ని వర్గాల మధ్య ఐక్యత ఏర్పరుస్తుందని అన్నారు. ధర్మం ప్రజల్లో సనాతన భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, పారిశ్రామిక వేత్తలు హర్ష, ప్రభాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబును ఆశీర్వదిస్తున్న అర్చక స్వాములు. ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ శ్రీనివాస కల్యాణము నిర్వహిస్తున్న దృశ్యం. హాజరైన భక్తజనం

చిరు ధాన్యాల పరిశోధన సంస్థ డైరక్టర్‌గా డాక్టర్ విలాస్ తొనపి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 11: భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన ప్రతిష్టాత్మక భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ నూతన డైరక్టర్‌గా డాక్టర్ విలాస్ తొనపి నియమితులయ్యారు. రాజేంద్రనగర్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో గురువారం కొత్త డైరక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ పరిశోధనల్లో మూడు దశాబ్ధాల సుదీర్ఘ అనుభవం గడించిన డాక్టర్ విలాస్ తొనపి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో విద్యనభ్యసించి 1990లో ఎఆర్‌ఎస్ ద్వారా భారత వ్యవసాయ పరిశోధన మండలిలో చేరారు. విత్తన పరిశోధన రంగంలో పలు విశేషమైన పరిశోధనలు చేశారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ విత్తన విభాగం అధిపతిగా కూడా డాక్టర్ తొనపి పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో విస్తరణకు కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తామని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి పని చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు ఉద్యోగులు, శాస్తవ్రేత్తలు అభినందించారు.
లక్ష సిసి కెమెరాలతో నిఘా
నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 11: భాగ్యనగరాన్ని విశ్వనగరంగా చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో నగరమంతా లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేయడానికి సంకల్పించామని, ఆ దిశగానే చర్యలు చేపట్డామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ రోడ్డు నెం1లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో సిసి టివి ప్రాజెక్టును ఆయన గురువారం ప్రారంభించారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని టైటాన్ ఐ షోరూమ్ నుంచి చింతల్ బస్తీ వరకు రెండున్న కిలోమీటర్ల మేర రూ. 22 లక్షలతో 36 సిసి కెమెరాలను అమర్చామని, ఇందుకు సంబంధించి నగదును 43 మంది దాతలు విరాళంగా అందిచారని కమిషనర్ మహేందర్ రెడ్డి వివరించారు. ప్రజల భాగస్వామ్యంలో ఆయా ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. నేరస్థులను పట్టుకోవడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని, నగరంలో ఇప్పటి వరకు 15వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది నాటికి నగరవ్యాప్తంగా లక్ష సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని సిపి తెలిపారు. నగరంలో ట్రాఫిక్ పోలీసు రహిత సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో ప్రవేశ పెడుతున్నట్టు నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.