కృష్ణ

బస్సు దగ్ధం-ప్రయాణికులు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకరికల్లు, అక్టోబర్ 31: మండలంలోని రూపెనగుంట శివారులో సోమవారం ప్రైవేటు బస్సు సాంకేతిక సమస్యతో అగ్నికి ఆహుతైంది. చిలకలూరిపేట సమీపంలోని గణపవరంలో శివసాయి టెక్స్ టైల్స్ ఇండస్ట్రీకి చెందిన బస్సు ప్రతి రోజు కూలీలను చేరవేసేందుకు రూపెనగుంట గ్రామానికి వస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం కూలీలను ఎక్కించుకునేందుకు వస్తుండగా రూపెనగుండ శివారు రాగానే బస్సులో టెక్నికల్ సమస్య తలెత్తి మంటల చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రత్తమై బస్సు ఆపేసి కూలీలను దింపేశాడు. ఈ సంఘటనలో ఏవరికి ప్రదామం జరగలేదు. ఎపి 07 టిడి 3893 నెంబర్‌గల ప్రైవేటు బస్సు పూర్తిగా దగ్ధమయింది. ఈ మేరకు నకరికల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

ఎట్టకేలకు మెడికోల ఆందోళన విరమణ
* అరెస్ట్‌కు ఆదేశాలిచ్చాం : మంత్రి కామినేని
* భవిష్యత్తులో జిల్లాలో పోస్టింగ్ ఇవ్వం
* జూడాలకు ప్రభుత్వం హామీ
గుంటూరు, అక్టోబర్ 31: డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య అంశంపై గత వారం రోజులుగా చేస్తున్న ఆందోళనను మెడికోలు విరమించారు. సోమవారం జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల్లో జూడాల డిమాండ్లకు స్పష్టమైన హామీ లభించడంతో ఎట్టకేలకు ఆందోళన విరమించేందుకు నిర్ణయించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎన్‌టిఆర్ వైద్యసేవ సిఇఒ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ గుంటూరు చేరుకుని జూడాల సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, రవిశంకర్ అయ్యన్నార్, జూడాల సంఘ ప్రతినిధులు ప్రిన్సిపాల్ చాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవిశంకర్ అయ్యన్నార్ మాట్లాడుతూ సంధ్యారాణి ఆత్మహత్య అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని జూడాల ప్రతినిధులకు వివరించారు. నిందితులపై చర్యలకు వెనుకాడే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసిందన్నారు. ఈ సమయంలో జూడాల ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రొఫెసర్ లక్ష్మికి గుంటూరు జిల్లాలో ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. దీనిపై రవిశంకర్ అయ్యన్నార్ మంత్రి కామినేనితో ఫోన్‌లో సంప్రదించారు. దీనిపై మంత్రి కామినేని సానుకూలంగా స్పందించడంతో జూడాలకు స్పష్టమైన హామీ లభించింది. మంగళవారం నుంచి విధులకు హాజరవుతామని జూడాలు ప్రకటించారు.

కీచక
శానిటరీ ఇన్స్‌పెక్టర్
సస్పెన్షన్

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, అక్టోబర్ 31: కార్మిక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ నాగలక్ష్మి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఏటి అగ్రహారంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని శానిటరీ ఇన్స్‌పెక్టర్ రాజేష్ గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం బాధితురాలు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన కమిషనర్ రాజేష్‌ను సస్పెండ్ చేశారు.

దేదీప్యమానంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవం
* ఘనంగా మహారుద్రాభిషేకం
గుంటూరు (కల్చరల్), అక్టోబర్ 31: శివ, కేశవ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్తీకమాసం రానేవచ్చింది. మాసాలన్నింటిలో కెల్లా అ త్యంత విశిష్టమై అలరారుతున్న ఈ కార్తీకమాసం ఆశ్వీయుజ శుద్ధ పా ఢ్యమి సోమవారం స్వాతి నక్షత్రం శు భవేళ ప్రారంభం కావడంతో హరి హ రులను సేవించే భక్తజనానికి అమితానందం కలిగింది. గతంలో కన్నా ఈ సంవత్సరం నగరంలోని అన్ని ప్రధాన శివాలయాలు, శివారు ప్రాంతాల్లో ఉన్న శివ, విష్ణు మందిరాలను సుందరంగా ముస్తాబు చేశారు. కార్తీక సోమవారం నాడు తమ గృహాల్లో తులసీమాత వద్ద కార్తీక దీపాన్ని వెలిగించి, అనంతరం శివాలయాలకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అరండల్‌పేటలోని శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి వారి దేవస్థానం భక్తజనంతో కిటకిటలాడింది. పంచామృతాలు, క స్తూరి కుంకుమ, గంధం, చందనంతో లింగధారుడ్ని అభిషేకించారు. పాత గుంటూరులోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం, కొత్తపేట ఉమామహేశ్వరాలయం, ఆర్ అగ్రహారం మల్లేశ్వరాలయం, సంపత్‌నగర్ శ్రీ శృంగేరీ శారదా పరమేశ్వర చంద్రవౌళేశ్వర ఆ లయం, జూట్‌మిల్లు శివాలయం, పట్ట్భాపురం మారుతినగర్ శంకర ఆల యం, బ్రాడీపేట ఓంకార క్షేత్రం, అదే ప్రాంతంలోని గౌరీ విశే్వశ్వరాలయం, నెహ్రూనగర్‌లోని ఉమామహేశ్వర మార్కండేయ ఆలయంతో పాటు అ న్ని శివాలయాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ముఖ్యంగా ధ్వజస్తంభా ల వద్ద భక్తులు కార్తీక దీపాలను శ్రద్ధాశక్తులతో అర్చించి వెలిగించారు. ఈ దీప కాంతులతో నగరంలోని ఆలయాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి.

యార్డు ప్రతిష్ఠను కాపాడాలి: మన్నవ
గుంటూరు (కొత్తపేట), అక్టోబర్ 31: గుంటూరు మిర్చియార్డును సక్రమంగా, సజావుగా నడిపించే కీలకమైన పాత్ర వే మెన్‌లు, కార్మికులపై ఉందని యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం గుంటూరులోని ఎఎంసి కార్యాలయంలో వే మెన్, ఇతర సిబ్బందితో సమావేశం యార్డు కార్యదర్శి దివాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ వే మెన్‌ల కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదని, వారి వౌలిక సదుపాయాల విషయంలో రాజీపడబోమన్నారు. గతంలో కంటే గౌరవంగా జీవించేలా కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికులు, కర్షకుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. యార్డులో వ్యాపార అభివృద్ధి జరగాలే తప్ప మోసాలకు తావు ఉండకూడదన్నారు. అందరూ సమిష్టిగా యార్డు పురోభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈ ట్రేడింగ్, క్యాంటిన్ మెడికల్ సదుపాయం, లైనెన్స్ రెన్యువల్, కాటా కూలీ తదితర సమస్యలను చైర్మన్ మన్నవ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు కొత్తూరి వెంకట్, డైరెక్టర్లు పసుపులేటి శ్రీనివాసరావు, మన్నవ కోటేశ్వరరావు, బండ్లమూడి జ్యోతికుమార్, శ్రీహరి, యార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

6న కానిస్టేబుల్ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
* 78 సెంటర్లలో 41,910 మంది హాజరు * రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్

గుంటూరు, అక్టోబర్ 31: పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ వ్రాత పరీక్ష ఈనెల 6వ తేదీన జరగనున్న దృష్ట్యా పకడ్బంధీ ఏర్పాట్లు చేసినట్లు రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్ తెలిపారు. సోమవారం పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి నారాయణ నాయక్ మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న పరీక్షకు గుంటూరు నగరంతో పాటు పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో మొత్తం 78 కేంద్రాలను ఏర్పాట్లు చేశామన్నారు. జెఎన్‌టియు కాకినాడ వారి ఆధ్వర్యాన నిర్వహించబడే ఈ పరీక్షలకు 41,910 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. జిల్లాలో నరసరావుపేట, గుంటూరులను రీజనల్ కేంద్రాలుగా ఏర్పాటు చేసి గుంటూరు కేంద్రానికి నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పి సిద్దార్ధ, నరసరావుపేట కేంద్రానికి ఎస్‌ఎస్ అండ్ ఎన్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పివి శ్రీనివాసరావులను నియమించడం జరిగిందన్నారు. ఈ పరీక్ష నిర్వహణలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోలను డిజిటల్ రూపంలో సేకరించి భద్రపరుస్తామన్నారు. అభ్యర్థులు వారి వారి హాల్‌టిక్కెట్‌లను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని సూచించారు. పరీక్ష జరిగే 6వ తేదీ ఉదయం 9 గంటల నుండి 10 గంటలలోపు మాత్రమే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తామని, 10 దాటితే ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టంచేశారు. ఈ దృష్ట్యా అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను గుర్తించి 8 గంటలకే చేరుకోవడం మంచిదన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను తీసుకురాకూడదని చెప్పారు. సమావేశంలో అడిషనల్ ఎస్‌పిలు రామాంజనేయులు, వీరభద్రుడు, డిఎస్‌పిలు మధుసూధనరావు, నాగేశ్వరరావు, రమణమూర్తి, మహేష్, సుధాకర్, సత్యనారాయణ, రీజనల్ కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

జనచైతన్య యాత్రలను విజయవంతం చేయాలి: జీవీ
గుంటూరు (కొత్తపేట), అక్టోబర్ 31: తెలుగుదేశం పార్టీ నేటి నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్న జనచైతన్య యాత్రలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జివి ఆంజనేయులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమార్ధం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహద పడే ఈ యాత్రల్లో కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని కోరారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలకు లోటు లేకుండా ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. 20 వేల యూనిట్లు కొరత ఉన్నప్పటికీ 24 గంటలూ నిరంతర విద్యుత్ సరఫరా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 44 లక్షల కుటుంబాలకు పెన్షన్, 10 వేల కోట్లతో డ్వాక్రా రుణాల మాఫీ, 24,500 కోట్లతో రైతులను రుణవిముక్తులను చేసిన ఖ్యాతి తమ ప్రభుత్వానిదేనన్నారు. ఎన్‌టిఆర్ భరోసా కింద 1100 జబ్బులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలైన 7 మండలాలను ఎపిలో కలపడం, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేసి కృష్ణాడెల్టాలో 2,500 కోట్ల రూపాయల పంటను కాపాడారన్నారు. తెలుగుదేశం పార్టీ రెండేళ్ల కొకసారి చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలన్నారు. గత సభ్యత్వ నమోదు 6,61,250గా ఉంటే ఈ ఏడాది 8.60 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వారికి ఆదుకోవడం జరుగుతుందని, 22 కోట్ల రూపాయలను 1100 మంది కార్యకర్తలు, వారి కుటుంబాలకు పంపిణీ చేశామన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ లాల్‌వజీర్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం 710 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, నవంబర్ 7వ తేదీన ఒంగోలులో మైనార్టీల కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చిట్టాబత్తిన చిట్టిబాబు, కసుకుర్తి హనుమంతరావు, ఖాదర్‌బుడే, దేవదాసు తదితరులు పాల్గొన్నారు.