తెలంగాణ

రైతుల చేత బీమా చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో రైతులందరి చేత పంటల బీమా చేయించాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. జాతీయ నూనెగింజలు, ఆయిల్‌పామ్ మిషన్ కింద యాసంగి వేరుసెనగ అధిక దిగుబడి సాధనపై జిల్లా వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం సదస్సు నిర్వహించారు. నాంపల్లిలోని ఉద్యాన శాఖ శిక్షణా కేంద్రంలో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ, పంటల బీమా చేయడం వల్ల రైతులు ప్రీమియం కొద్దిగానే చెల్లించాల్సి వస్తుందని, కాని విపత్కర పరిస్థితిలో వారికి లబ్ది చేకూరుతుందని అన్నారు. 2017 మార్చి 31 లోగా యాసంగి పంటలు చేతికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూంచారు.
వేరుసెనగ దిగుబడి పెంచేందుకు మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండాలని, జిప్సం వాడాలని, సూక్ష్మసేద్యం విధానంలో నీటిని వాడాలని వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి సూచించారు. యాసంగి వేరుసెనగ సాగు యాజమాన్య పద్ధతులపై సమాచార కరప్రతాలను విడుదల చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం. జగన్‌మోహన్, హాకా ఎండి ఎం. సురేందర్, విత్తన పరిశోధన డైరక్టర్ కొల్హర్కర్ తదితరులు పాల్గొన్నారు.