తెలంగాణ

డెంగ్యూ మృతులు ఇద్దరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 1: ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డెంగ్యూ జ్వరంతో ఇద్దరు మాత్రమే మృతి చెందారని రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జ్వరాలతో బోనకల్ మండలంలో 22మంది మృతి చెందడం, అన్ని రాజకీయ పార్టీలు హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తుండటంతో మంగళవారం వారు మండలంలో పర్యటించారు. పలుగ్రామాల్లో జ్వరంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో జ్వరాల తీవ్రత అధికంగానే ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. 8మంది మృతి చెందిన రావినూతలలో వైద్యశిబిరాన్ని సందర్శించి బాధితులకు అందుతున్న వైద్యసేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కొద్దిసేపు బాధితులను పరీక్షించారు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ డైరెక్టర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలో ఇప్పటివరకు డెంగ్యూతో మృతిచెందనది ఇద్దరేనని ఆయనన్నారు. డాక్టర్ శంకర్ నేతృత్వంలో గత ఏడాది కూడా ఈ ప్రాంతంలో డెంగ్యూ జ్వరాలపై సర్వే చేశారన్నారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాలకు రూ. 5నుండి 10లక్షల వరకు పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను మంత్రులు ఆదేశించారు.

రోగులను పరీక్షిస్తూ అధికారులతో
మాట్లాడుతున్న తెలంగాణ మంత్రులు