హైదరాబాద్

ఆద్యంతం.. ఆసక్తికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు మొత్తం నూటికి నూరు శాతం 150 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న మూడో మేయర్ ఎన్నిక గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఉదయం పదకొండు గంటలకు ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జ కౌన్సిల్ హాల్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించే సమయానికి 150 మంది కార్పొరేటర్లు, 44 మంది టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలకు చెందిన ఎక్స్ ఆఫీషియో సభ్యులు హాజరయ్యారు. ఎన్నిక ప్రారంభానికి పది నిమిషాల ముందు కొందరు కార్పొరేటర్లు లిబర్టీ చౌరస్తా, సచివాలయం, లుంబినీపార్కు ప్రాంతాల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కొందరు కార్పొరేటర్లు కాలినడకన కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు.
* సరిగ్గా ఉ. 11 గం.లకు ప్రిసైడింగ్ ఆఫీసర్ రాహుల్ బొజ్జ కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు.
* ఉ. 11.04 కార్పొరేటర్లకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు మూడు భాషల్లో ప్రమాణస్వీకార పత్రాలిచ్చినట్లు వివరిస్తూ, తాను పత్రం చదువుతుండగా, కార్పొరేటర్లు తనను అనసరించి, అందులో అవసరమైన చోట తమ పేరును చెప్పుకుంటూ ప్రమాణం చేయాలని ప్రకటించారు.
* ఉ. 11గం. 10 నిమిషాల నుంచి కార్పొరేటర్లు దశల వారీగా తమకు నచ్చిన భాషలో ప్రమాణస్వీకార పత్రాన్ని చదువుతూ పది నిమిషాల్లో అందరూ ప్రమాణస్వీకారం చేశారు.
* ఉ. 11 గం. 20 నిమిషాలకు ప్రమాణం ముగియటంతో ఆ పత్రంపై కార్పొరేటర్లు సంతకాలు చేసిన తాము కూర్చున్న వరుసకు ఇన్‌ఛార్జిగా నియమించిన వ్యక్తికి వాటిని అందజేయాలని ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జ సూచించటంతో కార్పొరేటర్లు వారికి అప్పగించారు.
* ఆ తర్వాత మేయర్ ఎన్నికకు వెళ్తున్నామని చెబుతూ, బలం ఎక్కువగా ఉన్న పార్టీతో ఇతర పార్టీలు కూడా మేయర్ అభ్యర్థిని, అభ్యర్థులను ప్రతిపాదించవచ్చునని సూచించారు. దీంతో వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ కవితా మనె్న గోవర్థన్‌రెడ్డి బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించగా, మీర్‌పేట హెచ్‌బికాలనీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య బలపరిచారు.
* ఉ. 11. 25 ని.లకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు, అభ్యర్థులను ప్రతిపాదించాలని పివో రాహుల్ బొజ్జ సూచించటంతో అమీర్‌పేట కార్పొరేటర్ శేషుకుమారి బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దిన్ పేరును ప్రతిపాదించగా, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు.
* ఇతర పార్టీలెవరైనా అభ్యర్థులను ప్రతిపాదిస్తున్నారా? అని రాహుల్ బొజ్జ ప్రశ్నించగా, ఏకంగా అహ్మద్‌నగర్ మజ్లిస్ కార్పొరేటర్ అయేషా రుబీనా లేచి, మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను మజ్లిస్ పార్టీ తరపున తామూ బలపరుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మెజార్టీ సభ్యులంతా హర్షధ్వనాలు చేయటంతో మేయర్, డిప్యూటీ ఎన్నిక ప్రక్రియ ముగిసిందని రాహుల్ బొజ్జ అధికారికంగా ప్రకటించారు.