ఆంధ్రప్రదేశ్‌

ఓట్ల కోసమే తెరపైకి ‘ట్రిపుల్ తలాక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 1: ఓట్ల రాజకీయాల కోసం, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ట్రిపుల్ తలాక్ వివాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఎపి కాంగ్రెస్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో కామన్ సివిల్ కోడ్ ప్రతిపాదనను ఖండిస్తూ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ మోదీ తన స్వార్థ ప్రయోజనాల కోసం లవ్ జిహాద్, ఘర్‌వాపసీ వంటి పదాలను సృష్టించి, వివిధ రకాలుగా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. భార్యకు న్యాయం చేయలేని వ్యక్తి ముస్లిం మహిళలకు ఎలా చేస్తారు? అంటూ ప్రశ్నించారు. మత వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దని, కామన్ సివిల్ కోడ్ పేరుతో బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తలాక్ అన్ని మతాల్లో ఉందని, ఇచ్చే విధానంలో మాత్రమే తేడా ఉందన్నారు. తలాక్‌కు సంబంధించి మహిళలకూ అధికారం ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. నగరంలో మంగళవారం కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
మోదీపై తీవ్ర ఆరోపణలు
ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌కు కరుడుగట్టిన ప్రచారక్ అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఉరీ లక్షిత దాడులను ఆర్మీ తన విధుల్లో భాగంగా నైపుణ్యంతో చేయగా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఇది ఖండించదగిన విషయమన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయి పటేల్ ఉదారవాది అని, సామాజిక న్యాయం కోసం పనిచేశారని గుర్తుచేశారు. పటేల్ ఒక దశలో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారన్నారు. గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్ ఉద్యకారుడని, ఆ విషయాన్ని ఆయన సోదరుడే స్పష్టం చేశారన్నారు.