కృష్ణ

జాతీయ స్థాయి పోటీల్లో తెలుగువారి ప్రతిభ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 1: జాతీయ స్థాయి పోటీల్లో తెలుగువారు ప్రతిభ చాటడం సంతోషకరమని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో ఫొటో జర్నలిజం పితామహుడైన ఆస్కార్ బర్నాక్ 1137వ జయంతి వేడుకలు, స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నేషనల్ ఫొటో కాంటెస్ట్-2016 నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన ఫొటోగ్రాఫర్లకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ పోటీల్లో విజయవాడ ఆంధ్రభూమి ఫొటోగ్రాఫర్ ఎ రామచంద్రరావు, రాజమండ్రి ఆంధ్రభూమి ఫొటోగ్రాఫర్ రాజేశ్వరరావు, బహుమతులు అందుకున్నారు. ఈసందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నిత్యం జరిగే సన్నివేశాలను కళాత్మకంగా, కొన్ని సమయాల్లో ఎంతో సాహసంగా తీసి ప్రజలకు చూపించడంలో ఫొటోగ్రాఫర్లు విజయం సాధిస్తున్నారన్నారు. గతంలో చరిత్రకు ఆధారంగా శాసనాలు వుండేవని, ఇప్పుడు చరిత్రకు ఆధారం ఈ ఫొటోలేనని చెప్పారు. ఎంతచెప్పినా అర్థంకాని విషయాలను ఒక ఫొటో ద్వారా పూర్తిగా చూపించగలమని వివరించారు. జాతీయ స్థాయి ఫొటో ప్రదర్శనల్లో తెలుగువారు అవార్డులు పొందటం సంతోషంగా వుందన్నారు. నాగార్జున యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ కోర్సును ప్రారంభించటం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ ఉప కులపతి ఎ రాజేంద్రప్రసాద్, శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కూడా ప్రసంగించారు. సభకు ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. కల్చరల్ సెంటర్ వ్యవస్థాపక చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.