తెలంగాణ

టి-టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. విజయవాడలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించగా, హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి సభ్యత్వం తీసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకా పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇ. పెద్దిరెడ్డి, రావులపాటి సీతారామారావు తదితరులు కూడా సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయించుకున్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వేం నరేందర్‌రెడ్డి, నన్నూరి నర్సిరెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎం. అమర్‌నాథ్ బాబు, బిల్యానాక్, ఎంఎస్ శ్రీనివాస్, సారంగపాణి, వీరేందర్‌గౌడ్, ఆర్. లక్ష్మణ్ నాయక్, సందీప్‌రెడ్డి, బిఎన్‌రెడ్డి, మేడిపల్లి సత్యం, అనూష రామ్, ప్రేమ్‌కుమార్ జైన్, సాయిబాబు, జి. బుచ్చిలింగం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో 15 లక్షల సభ్యత్వం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాయకులు తెలిపారు.