కృష్ణ

టిడిపిలోకి జలీల్‌ఖాన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో వలస రాజకీయాలు వూపందుకుంటున్న నేపథ్యంలో వైకాపాకు చెందిన విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు జలీల్‌ఖాన్ గురువారం మంత్రి దేవినేని ఉమతో కల్సి సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లటంపై పలురకాల పుకార్లు షికార్లు చేశాయి. జలీల్‌ఖాన్‌ను తెలుగుదేశంలోకి చేర్పించేందుకు మంత్రి దేవినేని ఉమ కొంతకాలంగా రాయబారాలు నిర్వహిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకులు కూడా బాహాటంగా చెబుతూ వస్తున్నారు. సిఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉమ, జలీల్‌ఖాన్ కలిసి కొద్దిసేపు సిఎంతో ఏకాంతంగా మాట్లాడుకోవటం మరిన్ని అనుమానాలకు దారితీసింది. కారణాలేమైనప్పటికీ ప్రస్తుతానికి ఆయన చేరిక వాయిదా పడినట్లుగా ప్రచారం జరిగుతోంది. తెలంగాణాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి వెళుతున్న నేపథ్యంలో ఇక్కడ వైకాపా ఎమ్మెల్యేలను చేరదీయటం సరైన విధానం కాదని కొందరు సీనియర్ నేతలు చంద్రబాబుకు హితవు చేసినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఏది ఏమైనా కొంతకాలంపాటు వలస రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకనున్నారు.
తెలుగుదేశంలో ఎందుకు చేరతాను
నియోజకవర్గ అభివృద్ధి పనులపై తాను ఎప్పుడు సిఎంను కలిసినప్పటికీ ఏకంగా తెలుగుదేశంలో చేరుతున్నట్లుగా తప్పుడు ప్రచారాలు ఊపందుకుంటున్నాయని ఆంధ్రభూమి ప్రతినిధితో జలీల్‌ఖాన్ అన్నారు. నియోజకవర్గంలోని అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, దీనిపై ముఖ్యమంత్రిని కలిసి పరిష్కరించుకుందామని జిల్లాకు చెందిన మంత్రి ఉమ చెప్పటంతో ఆయనతో కలిసి నేడు సిఎంను కలవడం జరిగింది మినహా రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.

భూగర్భ జలాల పెంపు, నదుల అనుసంధానం ద్వారా
కరువు రహిత రాష్ట్రంగా ఎపి
* జాతీయ సదస్సులో జలవనరుల మంత్రి దేవినేని ఉమ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 13: భూగర్భ జలాల నీటి మట్టాలు పెంపు, నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నీరొక్కటే ఆధారమని భావించిన ప్రభుత్వం జలవనరుల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ఉపరితల, భూగర్భ నీటి వనరుల సమన్వయ వినియోగంపై రెండురోజులపాటు జరుగనున్న జాతీయ సదస్సును మంత్రి దేవినేని ఉమ గురువారం పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు-చెట్టు పథకం కింద రాష్ట్రంలో సుమారు 40వేల చెరువులను పూడికలు తీయించటం వలన ముఖ్యంగా రాయలసీమలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ చెరువులన్నీ నిండిపోయాయన్నారు.
జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరువు రహితం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ సమయంలో 20 శాతం జలవనరులశాఖ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని జలాశయాలు, చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పెద్దఎత్తున నీరు-చెట్టు కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాలువల ప్రవాహ సామర్థ్యం పెరిగే విధంగా పూడికలు తీయడం జరిగిందన్నారు. భూగర్భ జలాలు, భూమిలో తేమ, ఉపరితల నీరు వంటి వాటిని శాస్ర్తియంగా అధ్యయనం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. వీటన్నింటి ఆధారంగా నీటిని సమర్థవంతంగా వినియోగించే పనులకు శ్రీకారం చుట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్ నీటిరంగ అభివృద్ధి పథకం ప్రాజెక్టు డైరక్టర్ వి.వెంకట్రామయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలోని వ్యవసాయ భూముల్లో 59 శాతం, ఉపరితల నీటి ద్వారా 37.61 శాతం భూగర్భ జలాల ద్వారా సాగవుతోందన్నారు. ఈ రెండింటిని సమన్వయం చేసుకొని మరింత ఎక్కువ సేద్యపు అవసరాల్ని తీర్చుకోవాల్సి ఉందన్నారు. నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు ద్వారా 101 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రవికుమార్ మాట్లాడుతూ కృష్ణా పరివాహక ప్రాంతంలో నీరు లేకపోవడం వల్ల ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్ 56 లక్షల ఎకరాలకే పరిమితమైందన్నారు. కృష్ణా పరిస్థితి ఇలా ఉంటే గోదావరిలో వృథాగా తగ్గిపోవడం రాబోయే తీవ్రతకు సంకేతంగా గుర్తించాలన్నారు.
భూగర్భ జల వనరుల శాఖ డెప్యూటీ ఎ.వరప్రసాద్ మాట్లాడుతూ, గత ఏడాది మార్చి 29న ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి సెప్టెంబర్ 9 నాడు మొదటి పంపు పనిచేయడం ప్రారంభమైందన్నారు. ఇలాంటి 24 పంపులు నుంచి గోదావరి జలాలు తోడి 7490 మీటర్ల వైశాల్యం కల పెద్ద తొట్టెలోనికి వదలడం జరుగుతుందన్నారు. పంపుహౌస్ నుంచి 4కిమీ వున్న పోలవరం కుడి ప్రధాన కాల్వకు ఈ నీటిని మళ్లించడం జరుగుతుందన్నారు.
నీటిపారుదల సంఘం సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రామం, మండల, జిల్లా స్థాయిల్లో భూగర్భ జలాలు, ఉపరితల జలాలు గణనచేసి, ఆయా ప్రాంతాలకు నీటి లభ్యతపై ఖచ్చితమైన గణాంకాలను జలవనరుల శాఖ రూపొందించిందన్నారు. ఈ సమావేశంలో నీటి ఉత్పాదక నిపుణుల కమిటీ సభ్యులు చెరుకూరి వీరయ్య చౌదరి సంచాలకులు అంతర్జాతీయ నీటి వినియోగ సంస్థ డాక్టర్ అమర్‌సింగే, శాస్తవ్రేత్త ఎంజీఆర్‌ఐ డా.షకీల్ అహ్మద్, వాగ్‌హెడ్ ప్రాజెక్టు సభ్యులు భరత్ కౌడి, చీఫ్ ఇంజనీర్, ఎన్‌డబ్ల్యుడిఎ డా.ఎం.కె శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ డబ్ల్యుఆర్‌డి, జివోఎటి డా.పి.రామకృష్ణ, గ్రౌండ్ వాటర్ శాఖ డా. కె.వేణుగోపాల్, సదస్సులో వివిధ రాష్క్రాటల జలవనరులశాఖ నిపువణులు, నీటి వినియోగ సంఘాల ప్రతినిధులు, రైతులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.