తెలంగాణ

ముందుకా.. వెనక్కా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ సచివాలయం కోసం కొత్త భవనాలు నిర్మించాలన్న సిఎం కెసిఆర్ ఆలోచనలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. హైకోర్టులో నమోదైన కేసుతో తాజా పరిస్థితిపై కెసిఆర్ ప్రభుత్వంలోని ముఖ్యులతో బుధవారం చర్చించారని తెలిసింది. అడ్వకేట్ జనరల్, న్యాయనిపుణులతో సిఎస్ రాజీవ్ శర్మ ఫోన్‌లో చర్చించారని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకు ఏం చెప్పాలన్న అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వాజ్యాలపై (పిల్) ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ వేయాల్సి ఉంది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగరాజన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. శంకర్‌నారాయణలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు హైకోర్టులో నమోదైన కేసు అడ్డుగా మారిందని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్ర సచివాలయాన్ని ప్రస్తుతం ఉన్న స్థలం నుండి మార్చేందుకు గతంలో రెండు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ‘బైసన్ పోలో గ్రౌండ్స్’ను పరిశీలించారు. దాదాపు 60 ఎకరాల్లో ఈ గ్రౌండ్ విస్తరించి ఉంది. అయితే ఇది బేగంపేట ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో ఉంది. దాంతో సాంకేతిక కారణాల వల్ల ఈ ఆలోచనకు తెరపడింది. ఆ తర్వాత ఎర్రగడ్డలోని ఛాతీవ్యాధుల ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని అనంతగిరి అటవీ ప్రాంతానికి తరలించి, ఈ భవనంతో పాటు 2015 జనవరి 30 ప్రభుత్వం నిర్ణయించింది.