తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలోని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఇకపై బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లో ఏరియా ఆసుపత్రులు 33, జిల్లా ఆసుపత్రులు 10 ఉన్నాయి. సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, గైర్హాజరు అవుతున్నారని తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ మిషన్లు గతంలో ఏర్పాటు చేసినప్పటికీ కొందరు సిబ్బంది నీళ్లు పోయడం, కావాలని పాడుచేయడంతో అవి వృథాగా పడి ఉన్నాయి. బయోమెట్రిక్ అమలుకావడం లేదు.
కానీ ఈసారి స్క్రాచ్ కార్డులు, ఐరిస్ విధానం ద్వారా బయోమెట్రిక్ అమలుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రతి ఆసుపత్రి నుంచి సిబ్బంది విధులకు హాజరుకాగానే స్క్రాచ్ కార్డు, ఐరిస్‌తో ఆన్‌లైన్ ద్వారా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు సమాచారం వెళ్లిపోతుంది. ఏ సమయానికి ఏ వైద్యుడు ఆసుపత్రికి వచ్చిందీ? ఎవరు గైర్హాజరు అయ్యిందీ? సమయానుసారం పూర్తిగా నివేదిక కమిషనర్ దృష్టికి వెళ్లిపోతుంది. నిఘా పెరగడంతో సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరో నెలరోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రులకు బయోమెట్రిక్ విధానం అమల్లోకి తేవాలని ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లు అవసరమైన ఏర్పాట్లుచేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఐరిస్, స్క్రాచ్ కార్డుల మిషన్ల కొటేషన్లు పరిశీలిస్తున్నారు.
భద్రాచలం ఏరియా ఆసుపత్రి కొత్త రికార్డు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానమైన ఈ ఆసుపత్రి వైద్యులు గడచిన అక్టోబర్ ఒక్క నెలలోనే 439 కాన్పులు చేసి రికార్డు సృష్టించారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఇదే ఆసుపత్రిలో 431 కాన్పులు చేసిన రికార్డు వుండగా, ఇప్పుడది బ్రేకయింది.
ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పులకు ప్రభుత్వం ప్రచారం కల్పిస్తున్నా సర్కారు దవాఖానాలకు రావడానికే ప్రజలు జంకుతున్నారు. అలాంటిది మన్యంలోని మారుమూలన ఉండే భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు మాత్రం ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇక్కడ కార్పొరేట్ వైద్యశాలలను తలదనే్నలా సేవలు అందిస్తుండటంతో ఏజెన్సీలోని అన్ని మండలాల నుంచి కాన్పుల కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికే వస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు 2,626 కాన్పులు చేయడం విశేషం. తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ఉన్న వైద్యవిధాన పరిషత్‌తో పాటు ఇతర వైద్యశాలల్లో ఎక్కడా జరగని విధంగా కాన్పులు నిర్వహిస్తూ గత రెండేళ్లుగా ఆసుపత్రి రాష్టస్థ్రాయి ‘బెస్ట్ ఏరియా హాస్పిటల్’గా అవార్డులు పొందింది. ఈసారి కూడా లక్ష్యాన్ని మించి కాన్పులు చేసిన వైద్యులు మరో అవార్డుకు చేరువయ్యారు.