తెలంగాణ

డెంగ్యూ, విష జ్వరాలపై సర్కారు నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: డెంగ్యూ వంటి విషపూరిత జ్వరాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టి.టిడిపి నేతలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సి) చైర్మన్ కక్రూకు ఫిర్యాదు చేశారు. మంగళవారం టి.టిడిపి ప్రధాన కార్యదర్శులు ఎం. అమర్‌నాథ్ బాబు, మల్లయ్య యాదవ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, పార్టీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ, ఇతర నాయకులు ఎంఎన్ శ్రీనివాస్, రాజు నాయక్ తదితరులు హెచ్‌ఆర్‌సి చైర్మన్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
ముఖ్యంగా ఖమ్మం తదితర జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మంది విష జ్వరాలతో బాధ పడుతున్నారని వారు తెలిపారు. కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్‌నూ వారు ఆయనకు అందజేశారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు. వారి వాదన విన్న హెచ్‌ఆర్‌సి చైర్మన్ కేసును 10వ తేదీన విచారణకు చేపట్టనున్నట్లు చెప్పారు. ఆ రోజున ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన ఆదేశించారు.