తెలంగాణ

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సర్కారు మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో పేదలకు విద్య అందని ద్రాక్షపండులా ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ విద్య ప్రాధమిక హక్కుతో సమానమని చట్టం చేసినా, సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చానా తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. విద్య మానవ వికాసానికి, సమాజ పరోగతికి పరోక్షంగా ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుందని తెలిసినా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూ వచ్చాయి. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం కళ్లు తెరవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 2015-16 డైస్ లెక్కల ప్రకారం 25,966 ప్రభుత్వ, 2596 ఆశ్రమ, 742 ఎయిడెడ్, 11470 ప్రైవేటు విద్యాసంస్థలు కలిపి 40,281 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాధమిక విద్య పరిధిలో 23,71,337 మంది, సెకండరీ విద్యలో 4,95,730 మంది విద్యార్ధులు ఉండగా 1,28,293 మంది ఉపాధ్యాయులున్నారు. అయితే వీటిలో 398 పాఠశాలల్లో సున్నా ఎన్‌రోల్‌మెంట్ ఉంది.
సర్వశిక్షా అభియాన్‌లో ఒప్పంద పద్ధతిలో 8180 మంది వివిధ కేటగిరిల్లో పనిచేస్తున్నారు. ఇందులో కొంతమంది 2001 నుండి సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఐఇఆర్‌పిలు (సహిత విద్యా వనరుల ఉపాధ్యాయులు) 934 మంది, క్లస్టర్ రిసోర్సు పర్సన్లు 1766 మంది, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు 467 మంది కంప్యూటర్ ఆపరేటర్లు 467 మంది, మెసెంజర్లు 467 పనిచేస్తున్నారు. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో 4007 మంది పనిచేస్తున్నారు.
ఒప్పంద ఉద్యోగుల పేరిట జరుగుతున్న దోపిడీపై సుప్రీంకోర్టు గత వారం తీవ్రంగా స్పందించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక కాంట్రాక్టు ఉద్యోగి దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తనకూ వేతనం చెల్లించాలని కోరగా, కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగుల మాదిరి వేతనాలు వర్తించవని పంజాబ్- హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అది ఉద్యోగుల హక్కు అని, కాంట్రాక్టు పేరిట తక్కువ వేతనం తప్పని, శ్రమ దోపిడీకి కృత్రిమ ప్రాతిపదికలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులకు ఊరట నిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. ఒకే పనికి ఒకే రకమైన జీతం/వేతనం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. జస్టిస్ జెఎస్ కేల్కర్, జస్టిస్ ఎస్ ఎ బాబ్డీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న 8100 మందికి సమాన వేతనాలు సమకూర్చాల్సి ఉందని ఎఎస్‌ఇఎపి జాతీయ ఉపాధ్యక్షుడు కల్పగిరి శ్రీను పేర్కొన్నారు. బంగారు తెలంగాణలో ఒక్క ఒప్పంద లేదా పొరుగు సేవల ఉద్యోగులు ఉండబోరని గతంలో సిఎం కె చంద్రశేఖరరావు చెప్పారని ఇప్పటికైనా ఈ అంశంపై దృష్టిసారించాలని వారు డిమాండ్ చేశారు.

పక్షం రోజుల్లో ‘తీపి’ కబురు

చెరకు రైతులకు ఎంపి కవిత హామీ

బోధన్, నవంబర్ 2: నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం దక్కన్ సుగర్స్ కర్మాగారం పరిధిలో చెరకు సాగు చేసే రైతులు పదిహేను రోజులలో శుభవార్త వినే అవకాశం ఉందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం బోధన్ ఏరియాకు చెందిన రైతులు, తెరాస నాయకులు హైదరాబాద్ వెళ్లి ఎంపి కవితను కలిసి సమావేశమయ్యారు. నిజాంసుగర్స్‌ను తెరిపిస్తేనే ఇక్కడి రైతులకు న్యాయం జరుగుతుందని వారు ఎంపిని కోరారు. చెరకు సాగు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ కర్మాగారం మూతపడటం వలన చెరకు సాగు చేయలేక పోతున్నామని చెరకు సాగుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారు విన్నవించారు. కర్మాగారం నడిపేందుకు ముందుకు వస్తే ఇక్కడ తామంతా చెరకు సాగు చేసి ఫ్యాక్టరీని కాపాడుకుంటామని, దాదాపు నాలుగు లక్షల టన్నుల చెరకు సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ఎంపి స్పందిస్తూ పదిహేను రోజులలో చెరకు సాగు చేసే విషయంలో రైతులకు అనుకూలమైన ప్రకటన వస్తుందని స్పష్టం చేశారు. ఈ కర్మాగారం నిర్వహణ విషయంలో తాను మొదటి నుండి గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలియజేశారని రైతులు వివరించారు. కర్మాగారం నడిపించే విషయంలో ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉందని ఎంపి తెలియచేసినట్లు వారు తెలిపారు. అయితే రెండేళ్ల పాటు ఈ కర్మాగారాన్ని ప్రభుత్వమే నడిపిస్తే ఆ తర్వాత రైతులు సహకార రంగంలో కర్మాగారాన్ని నడిపేందుకు కొంత ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయని ఈ విషయాన్ని కొందరు రైతులు ఎంపి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితులలో రైతులకు ఈ కర్మాగారాన్ని అప్పగిస్తే రైతులు ఒంటరిగా కర్మాగారాన్ని నడిపించే పరిస్థితిలో లేరని రైతులు ఎంపి వద్ద స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఎంపి కవిత స్పందిస్తూ ముందుగా రైతులు చెరకు సాగు చేసేందుకు అనుకూలమైన పరిస్థితులు ఆలోచించాలని కవిత పేర్కొన్నారు.
సమాధానం చెప్పినట్లు సమాచారం. ఎంపిని కలిసిన వారిలో తెరాస నాయకులు గోపాల్‌రెడ్డి, రజాక్, గిర్దావర్ గంగారెడ్డి, రవికిరణ్, శివరాజ్ తదితరులు ఉన్నారు.