హైదరాబాద్

‘నరుూం’ దడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: మాఫియా డాన్ నరుూం వ్యవహారం నగర ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకోనుందా? అన్న ప్రశ్నకు అవునేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నరుూం పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెంది నెలలు గడుస్తున్నా, ఆయనతో సంబంధాలు పెట్టుకుని నగరంలో భూ దందాలు, సెటిల్‌మెంట్లతో పాటు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారెంత మంది ఉన్నారన్నది ఇపుడు గ్రేటర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యకు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేయటంతో ఆయన బుధవారం పోలీసుల ముందు హజరయ్యారు. కృష్ణయ్యకు నరుూంతోనున్న సంబంధాలను సిట్ పోలీసులు ఆరా తీశారు. ఓ హత్య కేసు, భూ వివాదంపై ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది. నాగోల్‌లో ఇటీవల చోటుచేసుకున్న భూ వివాదం సంఘటనలో కూడా నరుూం గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు భూ యజమానిని బెదిరించిన నరుూం గ్యాంగ్ వివరాలను, అదే సమయంలో పోలీసులకు సమాచారమిచ్చిన ఫలితం లేని కారణంగా ఈ సంఘటన చోటుచేసుకుందంటూ బాధిత కుటుంబాలు తీవ్ర స్థాయిలో చేస్తున్న ఆరోపణలు నరుూం గ్యాంగ్ రంగప్రవేశం చేసిందనేందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నరుూం ఎన్‌కౌంటర్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన అనుచరుల స్థానాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన భూ మాఫియా గ్యాంగ్‌లు రంగప్రవేశం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను ప్రశ్నించిన పరిణామం గ్రేటర్ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు నగర స్థారుూ నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గతంలో నరుూం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కూడా నగరానికి చెందిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ అమాత్యులకు నరుూంతో సంబంధాలున్నాయన్న చర్చ జరిగింది. ఒక రాజకీయపార్టీ అంటూ సంబంధం లేకుండా మూడు,నాలుగు రాజకీయపార్టీలకు చెందిన నేతలకు నరుూంతో సంబంధాలున్నట్లు సిట్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విచారణను ముమ్మరం చేసిన సిట్ నగరానికి చెందిన పలువురు నాయకులను కూడా త్వరలోనే ప్రశ్నించే అవకాశాలున్నాయి. దీంతో కొందరు నేతలు అజ్ఞానంలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు కూడా సమాచారం.