తెలంగాణ

‘అవినీతికి అడ్రస్ కాంగ్రెస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అవినీతికి రాజధాని లాంటిదని టిఆర్‌ఎస్ ఎంపి బూర నర్సయ్య విమర్శించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎంపి మాట్లాడారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇక తమకు భవిష్యత్తు లేదు అనే భయం కాంగ్రెస్ నాయకులకు పట్టుకుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కాంగ్రెస్ నాయకులు ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని ప్రచారం చేశారని, అనుమానాలు రేకెత్తించారని కానీ కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం వాటన్నింటినీ పటాపంచలు చేసినట్టు చెప్పారు. అప్పట్లో వారిది గడీల పాలన అని , ఇప్పుడు టిఆర్‌ఎస్‌ది బడుల పాలన అని అన్నారు. ఒకే సంవత్సరం ఇన్ని గురుకుల పాఠశాలలు ప్రారంభించవచ్చునని కాంగ్రెస్ నాయకులు కలలోనైనా ఊహించారా? అని ప్రశ్నించారు.