తెలంగాణ

దైవ దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడిమ్యాల, నవంబర్ 3: దైవ దర్శనార్థం కోసం బయలు దేరిన ఆ కుటుంబాన్ని ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన రెండు కుటుంబాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ సమీపంలోని కుర్మపల్లి వద్ద వేములవాడ, కొండగట్టు రహదారికి అనుకుని ఉన్న వ్యవసాయ బావిలో గురువారం ఎపి 36 ఎసి 4788 అనే నంబర్ గల కారు అదుపుతప్పి బావిలో పడింది. దైవదర్శనం కోసం వచ్చిన వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బావిలో పడింది. ఈ సంఘటనలో నలుగురు మృత్యువాత పడగా, నవీన్ అనే వ్యక్తి ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ప్రమాదంలో హన్మకొండకు చెందిన కన్నం రామస్వామి (65) సార్వదేవి (55) కూర కుమారస్వామి (45) సుభాషిణి (40) మృత్యువాత పడగా, కన్నం నవీన్ ప్రాణాలు దక్కించుకున్నాడు. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి బావిలో పడిందని జిల్లా ఎస్పీ అనంతశర్మ ఘటన స్థలం వద్ద విలేఖరులకు తెలిపారు. ఇదిలాఉండగా ఎస్పీ తన సిబ్బందితో సహాయక చర్యల్లో పాల్గొని భారీ క్రేన్ల సహాయంతో బావిలో పడిన కారును, మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం.. మృతి చెందిన కన్నం రామస్వామి, శారదాదేవి