తెలంగాణ

అనర్హతపై తేల్చాల్సిందే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టిఆర్‌ఎస్‌లో చేరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఇప్పటికే దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలా? లేక వారు విలీనాన్ని కోరుతూ ఇచ్చిన లేఖపై నిర్ణయం తీసుకోవాలా? అనేది రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ముందు ప్రధాన సవాల్. టిడిపి ఎమ్మెల్యేలు 10 మంది టిఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు స్పీకర్‌కు లేఖ అందజేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం మూడింట రెండో వంతు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు కాబట్టి వారిని విలీనంగా స్పీకర్ గుర్తిస్తారని, దీనికి చిక్కులేమీ లేవని టిఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరుతూ స్పీకర్ వద్ద దాఖలైన పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా చూడాలని కోరుతూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూలులో నిర్ణీత గడువు ఏమీ లేదు.
టిడిపి నుంచి ఎన్నికైన పదిహేనుమంది ఎమ్మెల్యేలలో పదిమంది ఒకరి తర్వాత ఒకరుగా టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చివరకు...పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎర్రబెల్లి సైతం ఆ జాబితాలో చేరిపోయారు. కాబట్టి తమను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్నది వారి డిమాండ్. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఇందుకు భిన్నంగా
చెబుతున్నారు. అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున తొలుత వాటిని తేల్చిన తర్వాతే విలీనం గురించి చెప్పాల్సి ఉంటుందని, లోగడ సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా స్పష్టం చేసిందని అంటున్నారు. ఒకవేళ అనర్హత పిటిషన్‌ను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేస్తే తదుపరి విచారణకు ఆస్కారం ఉండదని అంటున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు విలీనాన్ని స్పీకర్ ఆమోదించడానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని 10వ షెడ్యూలులో స్పష్టత ఉన్నప్పటికీ, తొలుత స్పీకర్ అనర్హత పిటిషన్‌పై నిర్ణయం చెప్పాల్సి ఉంటుందని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సురేష్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు..
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న కెఆర్ సురేష్ రెడ్డి హయాంలో కాసాని జ్ఞానేశ్వర్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అప్పుడు టిఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కొందరు కాసాని నామినేషన్‌ను బలపరచడమే కాకుండా, ఓట్లు వేశారు. కాసానికి 11 ఓట్లు రావాల్సి ఉండగా, 14 ఓట్లు లభించాయి. పార్టీ ‘విప్’ను ధిక్కరించి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓట్లు వేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాల్సిందిగా టిఆర్‌ఎస్ అప్పటి శాసనసభాపక్షం నాయకుడు ఈటెల రాజేందర్ స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ నిర్ణయం ప్రకటించడానికి రెండు రోజుల ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. మరో ఐదుగురిపై అనర్హత వేటు వేశారు. ఆ కేసు ‘విప్’ ధిక్కారానికి సంబంధించింది. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేల వ్యవహారం పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది. అయినా రెండూ అనర్హత పిటిషనే్ల కాబట్టి స్పీకర్ తొలుత అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటారా? లేక విలీనంపై నిర్ణయం తీసుకుంటారా? అనేది వేయి డాలర్ల ప్రశ్నగా మారింది.
వచ్చే నెల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నందున ఈ లోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? లేదా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అసెంబ్లీ అధికారులు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు టిఆర్‌ఎస్ వైపు అంటే పాలకపక్షం సభ్యులు కూర్చునే (ట్రెజరీ బెంచ్) వైపు సీట్లు కేటాయించేందుకు అవకాశం ఉండదు. దీంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలు టిడిపికి లోగడ కేటాయించిన స్థానాల్లోనే కూర్చోవాల్సి ఉంటుంది. ఇటువంటి సాంకేతికపరమైన, సున్నితమైన సమస్యలపై స్పీకర్ మధుసూదనాచారి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్ రాజాసదారామ్ సూరజ్‌కుండ్‌లో చర్చించినట్లు సమాచారం. సూరజ్‌కుండ్‌లో ఏర్పాటైన పర్యాటక సదస్సులో పాల్గొనేందుకు స్పీకర్ వెళ్ళారు.