తెలంగాణ

గొప్ప సాంస్కృతిక నేపథ్యం హైదరాబాద్ సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: దేశంలోనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన సాంస్కృతిక నేపథ్యం ఉందని ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు.
సామాజిక స్పృహతో రన్నింగ్ ఈవెంట్స్ నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించబోయే 10కె రన్ లోగోను మంత్రి కెటిఆర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే రన్నింగ్ ఈవెంట్స్‌కు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రన్నింగ్ రేస్ నిర్వహించే స్థాయికి హైదరాబాద్ చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. హైదరాబాదీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారని, మర్యాద, అతిథ్యంలో ఈ నగరానికి గొప్ప పేరుందని మంత్రి కొనియాడారు.

చిత్రం.. 10కె రన్ లోగోను ఆవిష్కరిస్తున్న ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు