తెలంగాణ

సంచార గిరిజనులకు అధికారుల వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: నాగర్ కర్నూలు జిల్లాలో సంచార గిరిజన తెగలు, ఆశ్రీత కులాల వారికి కుల ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బంది కలిగిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. ఈ కులాల్లో కొన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెనుకబడిన తరగతుల జాబితాలో స్థానం సంపాదించినప్పటికీ వారికి కుల ధృవీకరణ పత్రాలు నిరాకరించడం అంటే రాజ్యాంగం ప్రకారం లభించిన రిజర్వేషన్ల సౌకర్యాన్ని వర్తించకుండా నిరాకరించడమే తప్ప మరొకటి కాదని, ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి పేరిట తాను చేపట్టిన మహాజన పాదయాత్ర 19వ రోజుకు చేరిందని ఆయన వివరించారు.