తెలంగాణ

నిమ్జ్‌లో 3వేల ఎకరాల్లో చైనా పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో మూడు వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు చైనా హునాన్ ప్రావెన్సీ ముందుకు వచ్చింది. ముంభైలో శనివారం ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో హునాన్ ఈ ప్రతిపాదన చేసింది. 2500 నుంచి 3000వేల ఎకరాల భూమి కావాలని, వీటిలో వివిధ విభాగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించనున్నట్టు హునాన్ ప్రతినిధి బృందం తెలిపింది. మెదక్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి వారికి సూచించారు. హునాన్ వాణిజ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ జహు నాయకత్వంలో పనె్నండుమంది సభ్యుల బృందం శనివారం ముంబయిలో మేక్ ఇన్ ఇండియా సదస్సులో తెలంగాణ అధికారులతో సమావేశం అయ్యారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలంగాణ అధికారుల బృందానికి నాయకత్వం వహించారు. తెలంగాణలో 2500-3000ఎకరాల్లో హునాన్ పార్క్ ఏర్పాటు చేయడానికి హునాన్ ప్రావెన్సీ బృందం ప్రతిపాదించింది. పరిశ్రమల శాఖ కమీషనర్ మనికారాజ్ కూడా సదస్సుకు హాజరయ్యారు.
chitram...
చైనా డెలిగేట్స్‌తో సమావేశమైన
తెలంగాణ అధికారుల బృందం