తెలంగాణ

గ్రూపు-2 అభ్యర్థులకు మన టీవీ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు సలహాలు-సూచనలు ఇచ్చేందుకు ‘మనటివి’ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోంది. టిఎస్‌పిఎస్‌సి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనటివి సిఇఓ ఆర్.శైలేష్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదుల చేస్తూ, ఈ నెల 11, 13 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అనుమానం కలిగినా, మనటివి నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, టిఎస్‌పిఎస్‌సి అధికారుల నుండి సూచనలు, సలహాలు పొందవచ్చని వివరించారు.