తెలంగాణ

బిజెపిది దివాళాకోరుతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తొలి ప్రధాని నెహ్రూను విమర్శించేందుకు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ పేరును బిజెపి వాడుకుంటోందని, బిజెపి దివాళాకోరుతనానికి ఇది నిదర్శనమని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ జైపాల్ రెడ్డి విమర్శించారు. శనివారం ఇక్కడ గాంధీభవన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఒక గల్లీ లీడర్ అని, ఆయనకు దేశ చరిత్ర తెలియదన్నారు. చరిత్ర తెలుసుకుని అమిత్ షా మాట్లాడాలన్నారు. పటేల్ అంటే బిజెపికి ప్రేమాభిమానాలు లేవన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. చరిత్ర చదువుకుని మాట్లాడాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. నెహ్రూ, పటేల్‌లు స్వాతంత్య్ర సమరంలో సమ ఉజ్జీలని, 30 ఏళ్లపాటు పోరాటాలు చేశారని, పదేళ్లపాటు జైలులో ఉన్నారన్నారు. మూడేళ్లపాటు కేంద్రంలో కలిసి పనిచేశారన్నారు. ఈ విషయంలో వారిద్దరి మధ్య విభేదాలు లేవన్నారు. అప్పటి మంత్రివర్గంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, జయప్రకాశ్ నారాయణ్, శ్యాంప్రసాద్ ముఖర్జీ పనిచేశారన్నారు. ఏ నిర్ణయం తీకున్నా అందరికీ మంత్రివర్గం నిర్ణయం శిరోధార్యమన్నారు. ఇవేమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లు బిజెపి నేతలు మాట్లాడడం తగదన్నారు. మహాత్మాగాంధీకి నెహ్రూ, పటేల్ ఇద్దరు ప్రియ శిష్యులన్నారు. హైదరాబాద్‌లో పోలీసు చర్య విషయంలో పటేల్ నిర్ణయం తీసుకున్నారని, పటేల్ ప్రధానిగా ఉండి ఉంటే కశ్మీర్ సమస్య ఉండేది కాదని బిజెపి ప్రచారం చేయడం చరిత్రపై అవగాహన లేకపోవడమే కారణమన్నారు. ఈ విషయాలు చరిత్ర తెలిసిన వారికి తెలుస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీని, నేతలను, ముఖ్యంగా నెహ్రూను విమర్శించే నైతిక అర్హత బిజెపి నేతలకు లేదన్నారు.