తెలంగాణ

ఎస్సారెస్పీ కాలువకు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 5: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని బీరిశెట్టి గూడెం శివారులో డిబియం 60 ఎస్సారెస్పీ కాలువకు శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు గండిపెట్టా రు. దీంతో ఒక్కసారిగా నీటిప్రవాహం బయటకు రావడంతో పక్కనే ఉన్న పంటపొలాలు నీటమునిగాయి. తమ గ్రామాలకు చెందిన చెరువులను నింపుకోవాలనే ఆతృతతో సమీప గ్రామాల్లోని రైతులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా రైతుల పంటలకు నీరు అందించాలనే లక్ష్యం తో ప్రభుత్వం గోదావరి జలాలను విడుదల చేసింది. పద్ధతి ప్రకారం చెరువులను నింపే కార్యక్రమాన్ని కూడా చేపడుతోంది. కానీ తమ చెరువులను తొందరగా నింపుకోవాలనే ఆతృతతతో గ్రామస్థులు నిబంధనలకు నీళ్లు వదలడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గోదావరి జలాలతో పంటనష్టం జరగడంతో గండి పెట్టిన ప్రాంతంలోని రైతులు విషయాన్ని ఎస్సారెస్పీ అధికారులకు తెలియపరిచారు. మధ్యాహ్నానికి సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారుల బృందం గండిపెట్టినచోట నీటి ప్రవాహానికి ఇసుక బస్తాలను అడ్డువేసి ప్రమాదాన్ని నివారించారు. విచారణ జరిపి ఎస్సారెస్పీ కాలువకు గండిపెట్టిన వారిని గుర్తిస్తామని, వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, గుర్తుతెలియని వ్యక్తుల చర్యల మూలంగా పంట నష్టపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
chitram...
బీరిశెట్టి గూడెం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గండిపెట్టిన ఎస్సారెస్పీ కాలువ