తెలంగాణ

తెలంగాణ ఏర్పడినా... మారని గిరిజన బతుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: నూతన తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గిరిజన విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్రంలో గిరజనులకు జరుగుతున్న అన్యాయాలు - భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థి జెఎసి కన్వీనర్ వెంకటేష్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్, టఫ్ చైర్మన్ విమలక్క, జయధీర్ తిరుమల రావు, పిఓడబ్ల్యు సంధ్య, నాగయ్యలతో పాటు గిరిజన విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో తీవ్ర అన్యాయాలకు గురైన గిరిజనులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తమ జీవితాలు మారతాయని భావించినా ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఏ విధమైన సమస్యలతో గిరిజనులు బాధపడుతున్నా రో అవే సమస్యలు ఇప్పటికీ కొనసాగడం విడ్డూరంగా ఉందన్నారు. కనీస సౌకర్యాలకు నోచుకోని గిరిజనులు దినదినగండంలా జీవితాన్ని వెళ్లదీస్తున్నారని అన్నారు. గిరిజన జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు కావడం లేదని, విద్య, వైద్య రంగాల్లో గిరిజనులు తీవ్ర వెనుకబాటును అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల పరిస్థితి అతి దయనీయంగా ఉందని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. అడవుల రక్షణ పేరుతో అటవీ శాఖ అధికారులు ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేసి పంపించాలని చూడటం సరైంది కాదని అన్నారు. అసైన్డ్ భుములంటూ వారి భూములను బలవంతంగా లాక్కొనే చర్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. అసైన్డ్ భూములైనప్పటికీ ప్రభుత్వం వాటిని విచక్షణారహితంగా లాక్కోవడానికి లేదన్నారు. దేశవ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం అమలుకు నోచుకోకపోవడం గిరిజనులకు శాపంగా మారుతోందని చెప్పారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు విద్య, వైద్యం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అనారోగ్యాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక ఆరోగ్య సేవలు అమలు అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కోదండరామ్ తెలిపారు.

చిత్రం.. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ప్రొ. కోదండరామ్