తెలంగాణ

రైతాంగం పట్టని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 6: నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, గిట్టుబాటు ధరలు, మార్కెట్‌ల దళారుల దోపిడీ తదితర సమస్యలతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పివి సింధు అనే క్రీడాకారిణి ఏదో ఆట ఆడి.. ఏదో మెడల్ సాధిస్తే నాలుగు కోట్ల రూపాయలు, సానియా మీర్జాకు రెండుకోట్లు ఇచ్చిన ప్రభుత్వానికి సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి చేతులు రావడం లేదని ఆయన విమర్శించారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయటానికి వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు పట్టడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రైతు పోరుయాత్ర కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలసి వివిధ గ్రామాలలో పాదయాత్ర నిర్వహించిన రేవంత్‌రెడ్డి సాయంత్రం భూపాలపల్లి పట్టణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణను ధనిక రాష్టమ్రని, ఆదాయ వనరులు పెరుగుతున్నాయని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రైతుల వ్యవసాయ రుణాలను వెంటనే ఎందుకు మాఫీ చేయడం లేదని, చనిపోయిన రైతుల కుటుంబాలకు ఎందుకు ఆర్థిక సహాయం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కెసిఆర్ హయాంలో ధనిక రాష్టమ్రని చెప్పుకుంటున్న తెలంగాణలో 2700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, చనిపోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తే రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు నాలుగు వందల రైతు కుటుంబాలకే ఇచ్చారని చెప్పారు. పివి సింధు మెడల్ తెస్తే హైదరాబాద్ అంతా ఊరేగించిన ప్రభుత్వం తెలంగాణ కోసం పోరాటం చేసిన, రైతుల సమస్యలపై ఉద్యమం చేస్తున్న జెఎసి నేత ప్రొఫెసర్ కోదండరాంకు వివిధ సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడడానికి నిమిషం సమయం కూడా కేటాయించడం లేదని, పైపెచ్చు ఆయనపై టిఆర్‌ఎస్ నాయకులు విమర్శలు, ఆరోపణల యుద్ధానికి దిగుతున్నారని అన్నారు. ఈ ఏడాది నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులతో వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో లక్షలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోతే బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో, రైతులకు పరిహారం చెల్లించటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. తెలంగాణ కోసం అహర్నిశలు కృషిచేసిన వ్యక్తులను పక్కనపెట్టిన ప్రభుత్వం తెలంగాణను వ్యతిరేకించిన తలసాని, తుమ్మల వంటి నాయకులకు మంత్రివర్గంలో పెద్దపీట వేసిందని విమర్శించారు. పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.

చిత్రం.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పోరుయాత్రలో పాల్గొన్న
టిడిపి నేతలు రేవంత్‌రెడ్డి తదితరులు