తెలంగాణ

ప్రాణం తీసిన గుంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సైదాబాద్, నవంబర్ 6: రోడ్లపై గుంతలు వాహనదారుల్ని కబళిస్తున్నాయి. రెండు వారాల కిందట కూకట్‌పల్లి సమీపాన మోటార్ సైకిల్‌పై వెడుతున్న ఇద్దరు విద్యార్థులు రోడ్డుపై ఉన్న గుంతలో పడటంతో వారిలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. నిన్న కాక మొన్న సఫిల్‌గూడలో అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోవడంతో మోటార్‌సైకిళ్లపై వెడుతున్న ముగ్గురు యువకులు గుంతలో పడి తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటనలు ఇంకా స్మృతిపథంలో కదలాడుతుండగానే అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున సంతోష్‌నగర్‌లో బైక్‌పై వెడుతున్న యువకుడు అదుపు తప్పి గుంతలో పడి కన్నుమూశాడు. మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జిల్లెల్లగూడలో నివాసముంటున్న హరికృష్ణగౌడ్ (33) శనివారం రాత్రి తన ఇంటి యజమాని బాలకృష్ణతో కలిసి మోటార్‌సైకిల్‌పై చాంద్రాయణ్‌గుట్టలోని స్నేహితుడి ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తెల్లవారుజామున తిరుగుప్రయాణమయ్యారు. వేగంగా వస్తున్న వారి వాహనం సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై డీఆర్‌డీఓ టౌన్‌షిప్ వద్ద గుంతలో పడింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడిక్కక్కడే మృతి చెందగా బాలకృష్ణను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జలమండలి అధికారులు తవ్వకాలు జరిపి గుంతలను సరిగ్గా పూడ్చకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు విమర్శిస్తున్నారు. సంతోష్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం... ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందిన హరికృష్ణగౌడ్