రాష్ట్రీయం

ఎట్టకేలకు ఎలిమినేటి ప్రాజెక్ట్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: రెండు దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్న శ్రీశైలం ఎడమ కాలువ పనులకు ఇంతకాలానికి మోక్షం లభించింది. నవంబర్ 9న ప్రాజెక్టును నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. మొత్తం 80వేల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు పనులు 1997నుంచి మందకొడిగా సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం పనులు వేగం పుంజుకోవటంతో నిర్ణీత సమయానికి కాలువ నిర్మాణం పూర్తయింది. చాలాకాలం పాటు పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును 1997లో ఓ శంకుస్థాపన రాయిని వేశారు కానీ, పనులు మాత్రం పెద్దగా జరగలేదు. 2007లో మరోసారి పనులు ప్రారంభించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుగా పేరు పెట్టారు. మొత్తం 80వేల ఎకరాలకు ప్రయోజనం కలిగే ఈ ప్రాజెక్టును గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయడం పట్ల ప్రతిపక్ష నేత జానారెడ్డి సైతం ప్రభుత్వాన్ని అభినందించారు. నల్గొండ జిల్లా 56 గ్రామాలకు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం కలుగుతుంది. లో లెవల్ కెనాల్ పథకం ద్వారా వరద సమయంలో నాగార్జున సాగర్ జలాశయం నుండి 575 అడుగుల ఎగువన నీటిని గ్రావిటీ ద్వారా తీసుకు వెళ్తూ, జలాశయం మట్టం 508 అడుగుల నుండి 575 అడుగుల మధ్యన ఉన్నప్పుడు ఎత్తిపోతల ద్వారా 50వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. ఎన్‌ఎస్‌పి లిఫ్టుల కింద ఉన్న 30వేల ఎకరాలకు, నీరు అందుతుంది. మొత్తం 80వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టారు. రాష్ట్రం ఏర్పడేంత వరకు 158 కోట్లను మాత్రమే ఖర్చు చేసి, నత్తనడక సాగించారు. తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేసి వేగిరపరచటంతో రెండేళ్లలో పూర్తయ్యాయి.
ప్రస్తుత రబీలోనే పంటలకు 33వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఆరు మండలాలకు తాగునీరు అందించనున్నారు.