తెలంగాణ

రిక్షాకాలనీలో కంపించిన భూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, నవంబర్ 7: రెండు పర్యాయాలు సెకన్ల వ్యవధి భూమి కంపించిన సంఘటన వికారాబాద్ సమీపంలో జరిగింది. వివరాలలోకి వెళితే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరి దారిలోని శ్రీఅనంత పద్మనాభ రిక్షా, హమాలీ కాలనీలో రాత్రి 9.10 గంటలకు రెండు పర్యాయాలు వరుసగా భూమి కదిలినట్లు కావడంతో కొందరు ఇళ్ల నుండి బయటకు వచ్చారు. రెండుసార్లు కంపించినట్లుగా అనిపించిన అనంతరం పేలినట్లు శబ్ధం వినిపించిందని కాలనీవాసులు చెప్పారు. ముందుగా సమీపంలో ఉన్న క్రషర్ నడుస్తున్న పని శబ్ధం కావచ్చనుకున్నారు. ఇళ్ల నుంచి చాలామంది బయటకు రావడం, మాట్లాడుకోవడం భూమి కంపించిందని గుర్తించారు. భూమి కంపించడంతో ఇళ్లలో సామాగ్రి కదిలిందని కాలనీవాసులు రాజు, ఓంకార్, ఆలం, ప్రవీణ్, కృష్ణ, దాసు, చంటిలు తెలిపారు. కాలనీలో వందకుపైగా ఇళ్లు ఉంటాయి. కాలనీ అనంతగిరి అడవికి సమీపంలో ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి, నిత్యం పాముల సంచారంతో భయపడుతూ జీవనం సాగించే కాలనీవాసులు భూమి కంపించినట్లవడంతో మరింతగా భయానికి లోనయ్యారు. ఎలాంటి సంఘటన చోటు చేసుకోకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. రాత్రి 11 గంటల దాకా ఇళ్లలోకి వెళ్లకుండా బయటే ఉండిపోయారు.

చిత్రం.. భూమి కంపించడంతో ఇళ్ల నుంచి 1బయటకు వచ్చిన కాలనీవాసులు.