తెలంగాణ

గురుకులాల్లో ప్రపంచ స్థాయి విద్యాప్రమాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 7: ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలను అనుగుణంగా రాష్టవ్య్రాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాల రాష్టస్థ్రాయి వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాసంస్థల్లో సదుపాయాలను కల్పిస్తుందన్నారు. త్వరలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాల విద్యార్థులకు డబుల్‌కాట్ బెడ్లను అందించనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ట్యాబ్‌లు అందజేయడంతో పాటు సైన్స్‌ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యాభోధన అందించడంతో పాటు మెరుగైన సదుపాయాలను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా త్వరలో అందరు విద్యార్థులకు స్పోర్ట్స్, నార్మల్ షూ జతలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులు ఫలితాలను సాధించడంలోను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఉన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అందువల్ల గత రెండేళ్లుగా విద్యాప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పారు. గురుకుల విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నార్‌సింగ్‌లోని గురుకులంలో రోబోటిక్ లేబొరేటరీని ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే అన్ని జిల్లాల్లో ఈ సదుపాయం కల్పిస్తామన్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు సహజయాత్రలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గురుకులకు మంజూరీచేసిన 7వేల పోస్టులను టిపిపిఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోపు ఈ ప్రక్రియను పూర్తిచేసి సిబ్బంది కొరతను అధిగమిస్తామన్నారు. విద్యార్థులకు ప్రామాణిక విద్యను అందించేందుకు ప్రత్యేక విద్యాక్యాలెండర్‌ను అమలుపరుస్తున్నామన్నారు.