తెలంగాణ

‘ఖేడ్’లో కారు జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ కేతనం ఎగురవేసింది. తెరాస అభ్యర్ధి మారెడ్డి భూపాల్‌రెడ్డి 53 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో ఘనవిజయం సాధించారు. చాలా కాలం పాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొద్ది నెలల క్రితం ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే.
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ లెక్కింపులో తొలి రౌండ్ నుంచి తుది రౌండ్ వరకు కారు జోరు యథేచ్ఛగా కొనసాగడంతో ప్రతి రౌండ్‌లో భూపాల్‌రెడ్డి 2 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో దూసుకెళ్లారు. దీంతో ఆయన ప్రత్యర్థులను అలవోకగా మట్టికరిపించారు. మొత్తం 93,076 ఓట్లను రాబట్టుకున్న భూపాల్‌రెడ్డి అంతిమంగా 53,625 ఓట్ల ఆధిక్యతతో తన సమీప ప్రత్యర్థి పటోళ్ల సంజీవరెడ్డి (39,451 ఓట్లు)ని చిత్తుచేశారు. ఇక టిడిపి అభ్యర్ధికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఆరు దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ రాజకీయాలతో సతమతమైన నారాయణఖేడ్‌లో ఈసారి ఓటర్లు అధికార పార్టీకి పట్టం గట్టడంతో తెరాస శ్రేణుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి.

చిత్రం... సిఎం కెసిఆర్‌ను కలిసిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి