తెలంగాణ

పెరిగిన భూగర్భ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజలాలు గత ఐదు నెలల కాలంలో మెరుగుకావడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. బోర్‌వెల్స్‌లో నీళ్లు సమృద్ధిగా ఉండటంతో వరి, వేరుశనగ, చెరకు, తదితర పంటలు వేస్తున్నారు. వరినాట్లు నవంబర్ 15 తర్వాత వేసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేయడంతో ప్రస్తుతం చాలా మంది రైతులు నారుమళ్లు వేసుకున్నారు. ఈ నెలలోగా వరినాట్లు దాదాపు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జూన్ నుండి అక్టోబర్ వరకు కురిసిన వర్షాలకు భూగర్భ జలాల మట్టం బాగా పెరిగిందని రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. సాధారణంగా వర్షాలు బాగా ఉంటే నదులు, వాగులు వంకల్లో నీటి ప్రవాహం ఉండటంతో పాటు జలాశయాల్లోకి నీరు చేరుతుంది. అలాగే కొంతనీరు భూమిలోకి ఇంకిపోతుంది. ఈ కారణాల మూలంగా భూగర్భజలమట్టాలు పెరుగుతాయి. రాష్ట్రంలో జూన్ నుండి అక్టోబర్ చివరి వరకు సాధారణ వర్షపాతం 813 మిల్లీమీటర్లు నమోదవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం గత ఐదు నెలల కాలంలో 999 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 23శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైంది.
నిరుటి(2015)తో పోలిస్తే ఈ సంవత్సరం భూగర్భనీటిమట్టాలు బాగా పెరిగాయి. రాష్ట్రంలో సరాసరిన 8.69 మీటర్లు (బిజిఎల్) పెరిగింది. నల్లగొండ, భద్రాద్రి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 145 మండలాల్లో భూఉపరితలానికి కేవలం రెండు నుండి ఐదుమీటర్ల మధ్య నీటిమట్టాలున్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్ధిపేట, నాగర్‌కర్నూలు జిల్లాల్లోని 29 మండలాల్లో మాత్రం 20 మీటర్లలోపల మాత్రమే నీటి మట్టాలు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో ఐదు నుండి 20 మీటర్ల మధ్యలో జలమట్టాలున్నాయి. మొత్తంమీద ఈ రబీలో రైతులు పంటలు వేసేందుకు వీలుగా భూగర్భజలాలు ఉండటంతో ఒకవైపు రైతులు, మరోవైపు ప్రభుత్వం కూడా ఆనందంగానే ఉంది. పంటలు పండితే రైతుల ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఈ పరిస్థితిలో సమాజంలో ఆర్థిక లావాదేవీలు కూడా పెరుగుతాయి. దాంతో ప్రభుత్వానికి కూడా పన్నులు తదితర రూపాల్లో ఆదాయం సమకూరుతుంది.