రాష్ట్రీయం

బిటిపిఎస్‌కు కేంద్రం షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం/మణుగూరు, నవంబర్ 9: భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు మరో షాక్ తగిలింది. 1080 మెగావాట్ల సామర్థ్యంతో రూ.7200కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలబెట్టిన ఈ విద్యుత్ కేంద్రానికి ఆది నుంచి కష్టాలు వెంటాడుతుండగా ఇప్పుడు మరో షాక్ తగిలింది. గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ సంబరపడుతున్న తరుణంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతిలిచ్చే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పింది. బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడుగుంట వద్ద నిర్మించ తలపెట్టిన కర్మాగారానికి రెడ్‌సిగ్నల్ వేశారు. రెండు మాసాల క్రితం ఆ కమిటీ ఇక్కడ పర్యటించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు నివేదికలందించింది. నిషేధిత సబ్‌క్రిటికల్ టెక్నాలజీని వాడుతున్నందున దీన్ని అనుమతించబోమని దీనివల్ల 10 కిమీల దూరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. దీంతో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అనుమతులు నిరాకరిస్తూ ఆదేశాలు జారీచేసింది.