రాష్ట్రీయం

నోట్ల రద్దుపై పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: దేశంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. న్యాయవాదులు కె శ్రీనివాస్, పివి కృష్ణయ్య ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. బుధవారం హైకోర్టు ధర్మాసనం ఎదుట ఈ అంశాన్ని న్యాయవాది పివి కృష్ణయ్య ప్రస్తావించచారు. ప్రజలు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని, కేంద్రం నిర్ణయం వల్ల వ్యవస్ధ అతలాకుతలమైందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సరైన మార్గదర్శకాలు జారీ చేయకుండా కేంద్రం, ఆర్‌బిఐ పెద్ద నోట్లను ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని కోరుతూ గతంలోనే కేంద్రానికి లేఖ రాశారన్నారు. సమాజంలో పెద్దవారికి నోట్లు రద్దవుతాయనే సమాచారం ఉందని, వారు జాగ్రత్తపడ్డారన్నారు. హైకోర్టు న్యాయవాది ఎస్ శ్రీరాం తన వాదనలు వినిపిస్తూ కేంద్రం నోట్ల రద్దుపై విధాన నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం వ్యవహరించిందా లేదా అనే విషయాన్ని కోర్టులు విచారించవచ్చన్నారు. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ ఏ శంకర్ నారాయణతో కూడిన ధర్మాసనం విచారించింది. అనంతరం ఈ పిటిషన్‌పై గురువారం కూడా విచారణ కొనసాగిస్తామని హైకోర్టు పేర్కొంది.