ఆంధ్రప్రదేశ్‌

‘వందే’మాతరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 9: ‘మోడీ మంచి పనిచేశారు. నల్లధనం తీసుకువచ్చేందుకు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సమస్యలున్నా దీన్ని మనం స్వాగతించాలి’‘ఇదేం ప్రభుత్వం? చెప్పా పెట్టకుండా నిర్ణయం తీసుకుంటే మా గతేం కాను? పెద్దనోట్లు ఎవరూ తీసుకోకపోతే మా బతుకేం కాను? మెడికల్ షాపువాడు కూడా చిల్లర ఇవ్వడం లేదు... పెట్రోల్‌బంకువాడు మిగిలిన చిల్లర ఇవ్వనంటాడు. వెయ్యిరూపాయలు తీసుకుని 700 ఇస్తామని బ్రోకర్లు చెబుతున్నారు. ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు’ 500, 1000 నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయంపై సగటు ప్రజల స్పందనలో కొన్ని గంటల్లోనే వచ్చిన మార్పు ఇది. బుధవారం రాత్రి మోదీని అభినందించిన వారే తెల్లారి కష్టాలు అనుభవంలోకి వచ్చాక తమ అభిప్రాయం మార్చుకున్న తీరిది. ఇప్పుడు జేబులో వంద రూపాయలున్నవాడే మొనగాడు. పర్సులో ఎన్ని 500, 1000 రూపాయల నోట్లున్నా అది చిత్తు కాగితమే! జేబులో డజను ఐదొందలు నోట్లు ఉన్నా, అది పనికిరాని చెత్తకాగితమన్న విషయం కాళ్లరిగేలా తిరిగిన తర్వాతగానే తెలియడం లేదు. పెట్రోల్‌బంకులు, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, ఇలా ఒకటేమిటి.. సర్వత్రా పెద్దనోట్ల చిల్లర గందరగోళమే. ఇళ్లు, భూములు, ఫ్లాట్ల అమ్మకాలు కొనుగోలుపై పెద్దనోట్ల రద్దు పెనుప్రభావం చూపింది.
బంకుల్లో మంకుపట్టు
రెండురోజులపాటు బ్యాంకులు, ఏటిఎంలు పనిచేయకపోవడంతో అందుబాటులో ఉన్న పెద్దనోట్ల చెలామణి సామాన్యుడికి పెను సమస్యగా పరిణమించింది. పెట్రోల్‌బంకుల్లో 500 రూపాయల పెట్రోల్ మొత్తం పోయించుకుంటే తప్ప పెట్రోల్ పోయడం లేదు. 300 రూపాయలు పెట్రోల్ పోయించుకుని మిగిలిన చిల్లరకు స్లిప్పు ఇవ్వమని కోరితే అసలు పెట్రోలే లేదు పొమ్మంటున్నారు.
ఆస్పత్రుల్లో ఆవేదన
ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల కష్టాలు వర్ణనాతీతం. మందుల కొనుగోలు పెద్ద సమస్యగా మారింది. బ్రెడ్డు నుంచి బిపి, సుగర్ టాబ్లెట్ల వరకూ చిల్లర సమస్య రోగులను వేధిస్తోంది. ప్రాణాధార ఔషధాల విషయంలో రోగులు విధి లేక రాజీపడి, ఐదొందలు వెయ్యి నోట్లకు చిల్లర త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని మెడికల్ షాపులు చిల్లరకు స్లిప్పులు ఇస్తున్నా, చాలావరకూ రోగులను దోపిడీ చేస్తున్నాయి.
ప్రయాణికుల పాట్లు
ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని బస్, రైల్వే స్టేషన్లలో చిల్లర గోల ప్రతిధ్వనించింది. పెద్దనోట్లు తీసుకుంటున్నప్పటికీ ప్రయాణికులకు ఇవ్వాల్సిన చిల్లర లేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి. దీనితో వేలాదిమంది తమ ప్రయాణాలు రద్దు చేసుకోవలసి వచ్చింది. ‘మేం పెద్దనోట్లు తీసుకుంటున్నాం. కానీ అందరూ అవే తీసుకువస్తే చిల్లర ఎక్కడినుంచి తీసుకువస్తాం? మా దగ్గర ఉన్న చిల్లర మేరకు టికెట్లు ఇస్తున్నా’మని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘మాకు ఈరోజు ఎదురయిన తలనొప్పికి పది టాబ్లెట్లు వేసుకోవాలి. అందరికీ చిల్లర ఇవ్వడం సాధ్యం కాదు కదా? ప్రయాణికులు అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర కూడా చిల్లర లేద’ని రైల్వే అధికారి వ్యాఖ్యానించారు.
బ్రోకర్ల పంట
పెద్దనోట్లు సృష్టించిన చిల్లర సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్న బ్రోకర్లు, జేబుదోపిడీకి దిగి గంటల్లో వేలరూపాయలు సంపాదిస్తున్నారు. హైదరాబాద్‌లో వెయ్యికి 300రూపాయలు, విజయవాడలో 400 రూపాయలు కమిషన్లు తీసుకుని చిల్లర ఇస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఈవిధంగా ఒక్క గురువారం కమిషన్ వ్యాపారమే కోట్ల రూపాయల్లో ఉందంటే చిల్లర దోపిడీ ఏ స్థాయిలో చేరిందో అర్ధమవుతోంది.