అంతర్జాతీయం

వమ్మయన హిల్లరీ ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 9: హాట్ ఫేవరెట్ హిల్లరీ ఎందుకు ఓడిపోయారు? ఆమె పరాజయం వెనుక బలమైన కారణాలేమిటి? అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహించే తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారనుకున్న హిల్లరీ అనూహ్య రీతిలో ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఇవి అంతుబట్టని ప్రశ్నలే! ప్రైమరీల నుంచి అధ్యక్ష ఎన్నికల చివరిరోజు వరకూ హిల్లరీదే విజయమంటూ హోరెత్తిన మీడియా అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి? తనవే అనుకున్న ఓట్లను హిల్లరీ చేజిక్కించుకోక పోవడమే ఆమె ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆఫ్రో అమెరికన్లు, లాటినోలు, ఆసియన్లు, యువ ఓటర్లపై హిల్లరీ ఎంతమాత్రం ప్రభావం కనబరచలేక పోయారు. హిల్లరీకి విజయాన్ని చేకూర్చే రీతిలో వీరిలో ఎవరూ కూడా తగిన సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఎన్నికల ప్రచారం ముగిసే చివరి క్షణం వరకూ కూడా తమదే విజయమన్న ధీమాతో హిల్లరీ ఉన్నారు. విస్కాన్‌సిన్ సహా అనేక అనుకూల రాష్ట్రాల ఓటర్లు హిల్లరీ ఆశల్ని వమ్ము చేశారు. పెన్సిల్వేనియా, మిచిగాన్ వంటి రాష్ట్రాల్లో డోనాల్డ్ కంటే దారుణంగా వెనుకబడిపోయారు. తను ప్రధాన లక్ష్యంగా చేసుకున్న కొన్ని రాష్ట్రాల్లో హిల్లరీ విజయం సాధించినప్పటికీ ఒబామా తరహాలో ఈ రాష్ట్రాల్లోని అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకోలేక పోయారని సిఎన్‌ఎన్ విశే్లషించింది. అనుకున్న స్థాయిలో మహిళలూ హిల్లరీకి దన్నుగా నిలువలేదని తెలిపింది. ట్రంప్‌పై ప్రతికూల వ్యాఖ్యలు చేసిన ఆఫ్రికా అమెరికన్లు, మెక్సికన్లు, వలస ప్రజలు ఆయనకే మొగ్గు చూపారని వివరించింది. ఆఫ్రికా అమెరికన్ల ఓట్లతోనే గెలిచిన ఒబామా నల్లజాతీయులందరూ హిల్లరీకే మద్దతివ్వాలని అభ్యర్థించినా ఫలితం లేకపోయింది.