తెలంగాణ

ఐటి, ఫార్మా, స్మార్ట్ సిటీలకు చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణలో ఐటి, ఫార్మా, స్మార్ట్ సిటీల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి బ్రిటీష్ పార్లమెంటరీ బృందాన్ని కోరారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నదని అన్నారు. ఐటి, స్మార్ట్ సిటీలతో పాటు ఫార్మా రంగంలోనూ పెట్టుబడులు పెట్టే విషయంపై దృష్టి సారించాలన్నారు. తమ అసెంబ్లీలో పేపర్-లెస్ అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో త్వరలో సభ్యుల టేబుళ్ళపై టచ్ స్క్రీన్స్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. బ్రిటిష్-్భరత్‌ల మధ్య సంబంధాలు ఇప్పుడు కొత్తగా ఏర్పడినవి కాదని, అనాదిగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎలా జరిగిందో స్పీకర్ క్లుప్తంగా వివరించారు.
అంతకు ముందు ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి ప్రసంగించేందుకు ఆసక్తి కనబరచకపోయినా, బ్రిటీష్ కంపెనీలు టెక్స్‌టైల్ రంగంలో ప్రాముఖ్యత సాధించినందున, వరంగల్‌లో ఏర్పాటయ్యే టెక్స్‌టైల్ పార్కుకు సహకరించాల్సిందిగా కోరారు. కౌన్సిల్ చైర్మన్ కె. స్వామిగౌడ్ ప్రసంగిస్తూ కౌన్సిల్ (పెద్దల సభ) విధి విధానాలు, వివిధ క్యాటగిరిల నుంచి సభ్యులు ఎన్నికయ్యే పద్ధతుల గురించి వివరించారు. బ్రిటీష్ (హౌస్ ఆఫ్ కామన్స్) ఎంపి వీరేంద్ర శర్మ ప్రసంగిస్తూ ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఇంకా బ్రిటీష్ ఎంపి నుస్రత్ ఘని, లార్డ్ రానా తదితరులు ప్రసంగించారు. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ సదారామ్ స్వాగతోపన్యాసం చేశారు. సమావేశానికి ముందు బ్రిటీష్ ప్రతినిధుల బృందం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
పవర్ పాయింట్ ప్రజంటేషన్
ఇలాఉండగా మిషన్ కాకతీయపై నీటి పారుదల శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, సమగ్ర తెలంగాణపై ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్య పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అంతకుముందు అసెంబ్లీకి వచ్చిన పార్లమెంటరీ బృందానికి శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ కె. స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, కౌన్సిల్‌లో డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్‌రావు, సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి, అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కౌన్సిల్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, కౌన్సిల్‌లో ప్రభుత్వ విప్ బొడెకుంటి వెంకటేశ్వర రావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజాసదారామ్, జాయింట్ సెక్రటరీ వి. నరసింహాచారి, ఇతర అధికారులు రాంరెడ్డి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటీష్ పార్లమెంటరీ బృందం సభ్యులు వీరేంద్ర శర్మ, సుస్రత్ ఘని, లార్డ్ రానా, లండన్, సిపిఎ అధికారిణి హెలెన్ గార్డనర్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రివ్ మైకెలస్టర్‌లను చైర్మన్, స్పీకర్, ప్రభుత్వ చీప్ విప్‌లు ఘనంగా సన్మానించారు.

అసెంబ్లీని సందర్శించిన బ్రిటిష్ పార్లమెంటరీ బృందంతో
స్పీకర్ మధుసూదనా చారి, సిఎల్‌పి నేత కె.జానారెడ్డి తదితరులు