తెలంగాణ

అభివృద్ధిలో రాజీలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజావసరాలకు అనుగుణంగా బడ్జెట్‌లో అన్ని శాఖలకు నిధుల కేటాయింపు జరుగుతుందని సిఎం కె చంద్రశేఖరరావు అన్నారు. ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు నిర్మించాలన్నారు. దీనికి నిధులు కేటాయిస్తామన్నారు. గత బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు, వాటి ఖర్చు, పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు కాకపోతే దానికి దారితీసిన కారణాలపై అధికారులు పూర్తిస్థాయిలో విశే్లషించాలని ఆయన కోరారు. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సిఎం కెసిఆర్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్భ్రావృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు ఉండాలని అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. బడ్జెట్ అంటే జమా ఖర్చుల తరహాలో ఉండకూడదని, సంస్కరణలు ఉండాలన్నారు. బడ్జెట్‌ను రూపొందించేటప్పుడు రాష్ట్రం యూనిట్‌గాకాకుండా, జిల్లా యూనిట్, అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రజావసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, ఇంకా ఎన్ని నిధులు కావాలనేదానిపై జిల్లాస్థాయి బడ్జెట్‌కార్డులు రూపొందించాలన్నారు. అధికార ప్రక్రియలు, నిధుల విడుదలలో హ్రస్వదృష్టి విధానాలకు, అడ్డంకులకు స్వస్తి చెప్పాలన్నారు. ఏ శాఖకు కూడా నిధుల కొరత ఉండకుండా చూడాలని, శాఖల భవన నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో రహదారులు, వంతెనల మరమ్మత్తుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారులు కూడా ఈ ఏడాది తాము ఏ మేర పనిచేయగలమనే దానిపై అంచనావేసుకోవాలన్నారు. తెలంగాణ ఆర్టీసిని లాభాల బాట పట్టించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాలని ఆర్టీసి అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు. ప్రతి డిపో నుంచి తిరుపతి, షిర్డికి బస్సులు నడపాలన్నారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతాలను గుర్తించి పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదాలు నివారించడానికి, కాలుష్య నియంత్రణకు కృషి చేయాలన్నారు. పోలీసు శాఖల్లో వివిధ అధికారుల సర్వీసు అంశాల్లో వివాదాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని కోరారు. జైళ్ల నిర్వహణలో సంస్కరణలు రావాలని, ఖైదీలను సంస్కరించే కేంద్రాలుగా జైళ్లు మారాలన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలు అనుసరిస్తున్న పద్ధతులు అధ్యయనం చేయాలన్నారు. హైవేల్లో పెట్రోలింగ్ పెంచాలని, అదనపు పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... సిఎం కె చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం
పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్న గవర్నర్ నరసింహన్