తెలంగాణ

సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకుండా, ప్రస్తుతం ఉన్న సచివాలయం భవనాలను కూల్చివేసి, కొత్తగా సచివాలయం భవనాలను నిర్మించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం సచివాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సచివాలయంలో వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు వాగ్వా దం, తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడంతో సచివాలయం పరిసరాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం సచివాలయాన్ని కూల్చడం దుర్మార్గమైన చర్య అన్నారు. సచివాలయానికి సెంటిమెంట్ బాగాలేదని సాకు చూపి పడగొట్టడం అసమంజసమన్నారు. ఇవ న్నీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలన్నారు. ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే, కోర్టును కూడా తప్పుదోవబట్టించే విధంగా ప్రభుత్వం బదులిచ్చిందన్నారు. గతంలో ఇదే సచివాలయంలో జడ్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబునాయుడు, వైఎస్‌ఆర్ సహా పలువురు ముఖ్యమంత్రులు పనిచేశారన్నారు. సచివాలయంలో చాలా భవనాలను ఇటీవలనే నిర్మించారని, వీటిని కూల్చివేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ కోసం, ప్రజలు ఆరోగ్య శ్రీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఉపాధి హామీ బకాయిలను ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. ప్రభుత్వం తక్షణమే అప్రజాస్వామిక ధోరణులను మానుకోవాలన్నారు. సచివాలయం భవనాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఖర్చవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి ఈ నిధులు ఖర్చుపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, డికె అరుణ, వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్, రామ్మోహన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద, ఎస్‌టి సెల్ చైర్‌పర్సన్ ఆరేపల్లి మోహన్, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నోట్లు చించేసి
తగులబెట్టారు!
యుపిలోని బరేలిలో వెలుగు చూసిన ఘటన
బరేలి, నవంబర్ 10: కేంద్ర ప్రభుత్వం అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో రద్దయిన ఈ నోట్లను గుట్టలుగా పోసి తగులబెట్టిన సంఘటన వెలుగు చూసింది. నగరంలోని సిబి గంజ్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులు బుధవారం ఈ నోట్లను బస్తాల్లో తీసుకు వచ్చి గుట్టలుగా పోసి తగులబెట్టినట్లు చెబుతున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వెయ్యి, అయిదు వందల రూపాయల నోట్లను ముందుగా ముక్కలు, ముక్కలుగా చించేసిన తర్వాత తగులబెట్టినట్లు కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇవి అసలైనవా లేక నకిలీ నోట్లా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి తగులబడిన నోట్లను పరీక్షిస్తున్నట్లు బరేలి పోలీసు సీనియర్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) జోగిందర్ సింగ్ చెప్పారు. నల్లధనం నియంత్రణకు మంగళవారం అర్ధరాత్రినుంచి 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం తెలిసిందే. ఈ ప్రకటనతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
హైకోర్టులో కారెం శివాజీ అపీలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 10: ఆంధ్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా తన నియామకం చెల్లదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన తీర్పుపై కమిషన్ చైర్మన్ కారెం శివాజీ హైకోర్టు ధర్మాసనం ఎదుట అపీల్ చేశారు. ఈ కేసులో అర్హతల ప్రాతిపదికన తన నియామకాన్ని సింగిల్ కోర్టు జడ్జి తోసిపుచ్చలేదంటూ శివాజీ అపీల్‌లో ప్రస్తావించారు.
ఆదాయం పన్ను కేసులో
సత్యం రాజు సోదరుడికి చుక్కెదురు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 10: సత్యం కంప్యూటర్ సర్వీసెస్ సంస్ధ వ్యవస్థాపకుడు బి రామలింగరాజు సోదరుడు బి సూర్యనారాయణ రాజు, అతని వదిన ఝాన్సీకి ఆదాయం పన్ను కేసులోహైకోర్టులో చుక్కెదురైంది. పన్ను బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆదాయం పన్ను శాఖ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సూర్యనారాయణ రాజు తదితరులు హైకోర్టును ఆశ్రయిస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టులో ఐటి శాఖ న్యాయవాది ఎం కిరణ్మయి వాదనలు వినిపించారు. ఈ కేసులో కింది కోర్టు పిటిషనర్లకు శిక్ష విధించిందని, ఈ సమయంలో సాంకేతిక కారణాల ప్రాతిపదికన తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది.